Hero Nagashowrya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫాంహౌస్ లో వారి కుటుంబానికి తెలియకుండా పేకాట నిర్వహించిన గుత్తా సుమన్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసు అనూహ్య మలుపు తిరిగినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ శివారు మంచిరేవుల పేకాట కేసులో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ అరెస్ట్ అయ్యారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన్ను ఉప్పర్ పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు హాజరుపరిచారు.
నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాట నిర్వహించిన క్యాసినో కింగ్ పిన్ గుత్తా సుమన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శివలింగ ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవుల ఫాంహౌస్ లో పేకాట కేసులో సినీ నటుడు నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్ 31న రాత్రి మంచిరేవులలోని నాగశౌర్య కుటుంబానికి చెందిన ఫాంహౌస్ లో పేకాట ఆడుతూ పోలీసులకు కొందరు ప్రముఖులు, బడాబాబులు, మాజీ ఎమ్మెల్యే దొరికాడు. ప్రధాన నిందితుడు సుమన్ సహా 30 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా సుమన్ ను విచారించిన అనంతరం నాగశౌర్య తండ్రి ప్రమేశయం ఇందులో ఉందని పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిసింది.
కాగా నాగశౌర్య తండ్రికి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని.. లీజుకు ఇస్తే గుత్తా సుమన్ పేకాట నిర్వహించాడని సమాచారం. ఈ క్రమంలోనే శివలింగ ప్రసాద్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.