కానీ సినిమాల పై ఆసక్తితో తెలుగు తెరకు పరిచయమై.. ‘భలే మంచి రోజు, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, నిన్న రిలీజ్ అయిన శ్రీదేవి సోడా సెంటర్’ లాంటి చిత్రాలతో హీరోగా బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మరో నటుడు అవసరాల శ్రీనివాస్. కొన్నాళ్లు పాటు అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) రాకెట్ బాల్ క్రీడను తన స్పోర్ట్స్ కెరీర్ గా ఎంచుకుని ముందుకు వెళ్ళాడు.
పైగా ఆ క్రీడకు సంబంధించి పలు అంతర్జాతీయ పొటీలలో కూడా అవసరాల మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక క్రేజీ హీరో నాగశౌర్య (Naga Shaurya).. ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్. నాగశౌర్య ఆ రోజుల్లో పలు జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, అశ్వత్థామ లాంటి సినిమాలతో మంచి హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆదర్శ్ బాలక్రిష్ణ కూడా క్రీడాకారుడే. అవును ఆదర్శ్ మంచి క్రికెట్ ఆటగాడు. హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తూ, రంజీ లాంటి టోర్నమెంట్లలలో కూడా ఆడారు. అయితే, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక, క్రికెట్ కి గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం తెలుగు సినీ నటుడిగా ఉన్నాడు.
ఇక సీనియర్ హీరో సుమన్ కూడా సినిమాలలోకి రాకముందే కరాటేకి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు మన దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం విశేషం. పైగా కరాటే ట్రైనర్ గా కూడా సుమన్ కొన్నాళ్లు పాటు ఉద్యోగం చేశారు.