Pindam Twitter Review: డిజిటల్ కంటెంట్ కి ఆదరణ పెరిగిన తర్వాత హారర్ చిత్రాలు థియేటర్స్ లో కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కట్టిపడేసే స్క్రీన్ ప్లేతో భయపెట్టగలిగితే విజయం సొంతం అవుతుంది. ఇదే జోనర్లో వచ్చిన చిత్రం పిండం. ఈ చిత్ర టైటిల్, ప్రోమోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకులు పిండం చిత్రం పట్ల ఆసక్తిగా ఉన్నారు. శ్రీరామ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ కీలక రోల్స్ చేశారు.
డిసెంబర్ 15న పిండం మూవీ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ ఎలా ఉందో చూద్దాం. పిండం మూవీ కథ పరిశీలిస్తే… శ్రీరామ్ ఒక రైస్ మిల్లులో అకౌంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య ఖుషి రవి. వీరికి ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు ఓ పురాతన ఇంటిని కొనుగోలు చేసి అక్కడకు మారతారు. అప్పటి నుండి సమస్యలు మొదలవుతాయి. గర్భవతి అయిన భార్య ఖుషి రవి ఆసుపత్రిపాలు అవుతుంది. శ్రీరామ్ తల్లికి ప్రమాదం జరుగుతుంది.
ఈ పర్యవసానాలకు కారణం ఏమిటీ? వీటి వెనకున్న అదృశ్య శక్తి ఏంటి? శ్రీరామ్ కుటుంబం ఈ సమస్యల నుండి ఎలా బయటపడ్డారు? అనేది కథ. ఇక పిండం మూవీ పాజిటివ్ రివ్యూలు దక్కించుకుంటుంది. మెజారిటీ ఆడియన్స్ సినిమా బాగుందని ట్వీట్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు అక్కడక్కడగా భయపెడుతూ మూవీ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు అయినప్పటికీ సాయి కిరణ్ దైదా చక్కని స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా సినిమా నడిపించాడు.
సన్నివేశాలకు కృష్ణ సౌరభ్ సూరంపల్లి బీజీఎం ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ సైతం ఆసక్తిగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కొంచెం రొటీన్ గా అనిపించినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మెప్పిస్తుంది. నటులు శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు మెప్పించారు. శ్రీనివాస్ అవసరాల తక్కువ నిడివి కలిగిన పాత్రలో ప్రభావం చూపించారు. ఓవరాల్ గా పిండం ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లర్. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Inside Talk: #పిండం #Pindam is one film which generates genuine Horror Vibes to the audience while watching and it’s strictly prohibited for pregnant women. You can try for Trapidation.
— Raghu Vamsi (@raghuvamsi1102) December 15, 2023
#PindamReview
Background score & Photography gave birth to #pindam
Debue Director @saikirandaida wrote well. #sriram @KusheeRavi @EswariRao
& Kids remarkable acting.
Must watch in theatres only. #PragadaRating 3/5@venupro@SatishManoharan#praburaja #yashwant#18fms #18f pic.twitter.com/lvhK5n60bn— Narayana Pragada (@pragada1) December 14, 2023