https://oktelugu.com/

Varalakshmi Sarath Kumar : వినూత్న రీతిలో గ్రాండ్ గా జరిగిన వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం..వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు!

వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ఏడాది జులై నెలలో నీకొలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంగా ఈమె చాలా సింపుల్ గా చేసుకుంది. ఆ తర్వాత ఈమధ్యనే ఆమె ఫారిన్ లో బీచ్ వెడ్డింగ్ చేసుకుంది. చాలా కూల్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న వరలక్ష్మి, మరియు ఆమె భర్త ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 18, 2024 / 04:45 PM IST

    Varalakshmi Sarath Kumar Wedding photos

    Follow us on

    Varalakshmi Sarath Kumar : సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ లేడీ విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఎలాంటి పాపులారిటీ ని సంపాదించుకుందో మన అందరికీ తెలిసిందే. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి క్రాక్ చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘తెనాలి రామకృష్ణ’, ‘యశోద’, ‘నాంది’, ‘వీర సింహా రెడ్డి’ వంటి సినిమాలతో మరింత దగ్గరైంది. ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కూతురుగా ఈమె ‘పోడా పోడి’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో ఈ చిత్రాన్ని ‘దొంగ..దొంగది’ అనే పేరుతో రీమేక్ అయ్యింది. మంచు మనోజ్ మొట్టమొదటి చిత్రమిది. అలా తమిళంలో హీరోయిన్ గా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈమె, ఆ తర్వాత కేవలం హీరోయిన్ రోల్స్ లో మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించింది. విలన్ రోల్ లో ఆమె బాగా సక్సెస్ అవ్వడంతో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆమెని ఆ రోల్స్ లోనే చూపిస్తూ వస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ఏడాది జులై నెలలో నీకొలాయ్ సచ్దేవ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంగా ఈమె చాలా సింపుల్ గా చేసుకుంది. ఆ తర్వాత ఈమధ్యనే ఆమె ఫారిన్ లో బీచ్ వెడ్డింగ్ చేసుకుంది. చాలా కూల్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న వరలక్ష్మి, మరియు ఆమె భర్త ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ విధంగా విన్నూత రీతిలో బీచ్ వెడ్డింగ్ ఈమధ్య కాలంలో మన టాలీవుడ్ సెలెబ్రిటీలు పెళ్లి చేసుకోలేదు. ఆ ఘనత వీళ్లిద్దరికీ దక్కింది. ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన అభిమానులతో యాక్టీవ్ గా ఉండే వరలక్ష్మి శరత్ కుమార్, ఈ ఫోటోలను తన అభిమానులతో పంచుకోగా, వాటికి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి.

    ఇదంతా పక్కన పెడితే గతంలో వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ మధ్య ప్రేమాయణం ఒక రేంజ్ లో నడిచింది. వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో కొన్ని అనుకోని కారణాల వల్ల వీళ్లిద్దరు బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది. వీళ్లిద్దరు కలిసి అనేక సూపర్ హిట్ సినిమాల్లో హీరో హీరోయిన్లు గా నటించారు. అదే విధంగా విశాల్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘పందెం కోడి’ సీక్వెల్ ‘పందెం కోడి 2’ లో ఈమె విలన్ గా నటించింది. ఈ చిత్రం నుండే ఆమెకి వరుసగా విలన్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో కన్నడ పాన్ ఇండియన్ చిత్రం మ్యాక్స్ ఉంది. సుదీప్ హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తెలుగులో ఈమె ‘కూర్మ సుందరి’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది.