https://oktelugu.com/

Anasuya Bharadwaj : అనసూయ గుడికెళితే ఎలా ఉంటుందో తెలుసా?

సోషల్ మీడియాలో తన డైలీ అప్టేట్స్ పంచుకుంటోంది. తాజాగా వైకుంఠఏకాదశి సందర్భంగా అనసూయ గుడికెళ్లి ఆ సంప్రదాయ ఫొటోలు పంచుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2023 / 11:58 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj : అనసూయ ఏం చేసినా అందమే.. అందానికి పేరు పెడితే ‘అనసూయ’ అని చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ అయినా సంప్రదాయ కట్టైనా సరే ఆమె అందం చూస్తే ప్రతి ఒక్కరు అదరహో అనక తప్పదు. వయసు పెరిగే కొద్ది అందమంటే అనసూయ అనేలా మారుతున్నారు. యాంకర్ గా మొదలైన ఆమె ప్రస్థానం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రేక్షకాదరణ కలిగి ఉన్నారు.

    బుల్లితెరపై యాంకర్ గా రిజైన్ చేసి ఫుల్ టైం సినిమాల్లోకి వచ్చాక అనసూయ స్పీడ్ పెంచింది. వరుస సినిమాల్లో నటిస్తూ పలు షాప్ లు ఓపెన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ అనసూయ బిజీబిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

    చలాకీగా ఉండే అనసూయ ఆకట్టుకునే మాటలతో చూపు తిప్పుకోలేని అందంతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అనసూయ అందం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గ్లామర్ పరంగా ఆమె రేంజ్ వేరే.

    సోషల్ మీడియాలో తన డైలీ అప్టేట్స్ పంచుకుంటోంది. తాజాగా వైకుంఠఏకాదశి సందర్భంగా అనసూయ గుడికెళ్లి ఆ సంప్రదాయ ఫొటోలు పంచుకుంది.