Pawan Kalyan- Gabbar Singh Sai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిలా ఆరాధించేవాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు పవన్ ను దేవుడిలా కొలుస్తుంటారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ బ్యాచ్ గుర్తుంది కదా. ఆ గ్యాంగ్ అంతా పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు. ముఖ్యంగా పవన్ సింప్లిసిటీ కి వాళ్ళు గులామయ్యారు. వీరంతా పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తుంటారు. తాజాగా ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్ లో సాయి అనే నటుడు కూడా ఉన్నాడు. ఇతగాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై తమకున్న అభిమానం ఎలాంటిదో క్లారిటీగా చెప్పుకొచ్చాడు.

‘గబ్బర్ సింగ్ సాయి’ తన ఇంట్లోని పూజ గదిలో దేవళ్లందరితో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా పెట్టుకున్నాడు. తనకు పవన్ కళ్యాణ్ దేవుడితో సమానం అని సాయి చాలా ఎమోషనల్ గా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఈ వీడియో బాగా ఆకట్టుకుంటోంది.
మరి తెలుగు ప్రజలు డెమీ గాడ్ గా కొలుస్తుండే పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ సక్సెస్ కావాలని కోరుకుందాం. పేద వాడి ఆత్మగౌరవమే తన ప్రధాన అజెండాగా, స్వార్ధ రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్న పవన్ కు అంతా మంచి జరగాలని.. వచ్చే ఎన్నికల్లో పవన్ పార్టీ గెలవాలని.. పవన్ సీఎం అవ్వాలని ఆయన అభిమానులతో పాటు సాధారణ సగటు మనిషి కూడా కోరుకుంటున్నాడు.

నిజమే పేదల పరిస్థితి బాగుపడాలంటే, అవినీతి అంతమవ్వాలంటే, అభివృద్ది జరగాలంటే, అందరూ బాగుండాలంటే.. మంచి నాయకుడు కావాలి, నిజాయితీ గల నాయకుడు రావాలి. ఆ నాయకుడే దేవుడు ఆడుతాడు. ఆ దేవుడే మానవ రూపమెత్తి ఇదిగిదిగో ఈ నాయకుడి రూపంలో వచ్చాడు అని ప్రజలు దణ్ణాలు పెడతారు. ఇప్పుడు పవన్ విషయంలో జరుగుతుంది ఇదే.
పవన్ కళ్యాణ్ నడిచే నిజాయితీ, పవన్ కళ్యాణ్ కనబడే ఆదర్శం, అభివృద్ది సాధించే ఏకైక శక్తి పవన్. మరి ఇలాంటి పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు దేవుడిగా కొలుస్తూ పూజలు చేయడంలో వింత ఏం ఉంది. గబ్బర్ సింగ్ సాయి ఒక్కడే కాదు, మరెంతోమంది పవన్ ను పూజిస్తున్నారు. దేవుడిలా కొలుస్తున్నారు.