https://oktelugu.com/

Manchu Manoj – Ambani : అంబానీతో మంచు మనోజ్ ఫోటో దిగడం వెనకాల అసలు కారణం అదే..

ఇక మొన్నటి వరకు మంచు మనోజ్ పాలిటిక్స్ లోకి వెళ్తాడు అనే వార్తలు వినిపించినప్పటికీ వాటన్నింటిని కొట్టివేస్తూ ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా మారుతున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2023 / 09:32 PM IST
    Follow us on

    Manchu Manoj – Ambani : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటుగా మంచు ఫ్యామిలీకి కూడా మంచి ఇమేజ్ ఉంది.ఇక ఇందులో భాగంగానే మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ భూమ మౌనిక రెడ్డి ని రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు.ఇక ప్రస్తుతం ఆయన సినిమాల మీద మళ్లీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.అందులో భాగంగానే కొత్త డైరెక్టర్ తో వాట్ ది ఫిష్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక అలాగే ఓటిటి లో సంస్థ కోసం ఒక టివి షో కూడా చేస్తున్నాడు.ఇలా మంచు మనోజ్ కెరియర్ పరంగా బిజీగా మారుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన రీసెంట్ గా ముకేష్ అంభానిని కలిసి ఆయనతో ఒక ఫోటో దిగడం జరిగింది ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అసలు ఆయన ముకేష్ అంభానీ ని మంచు మనోజ్ ఎందుకు కలిశాడు అనే విషయం మీద చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి.

    అందులో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే… ముకేష్ అంభాని జియో వరల్డ్ ప్లాజా ని లాంచ్ చేశాడు.ఇక ఈ కార్యక్రమంలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్,రణవీర్ సింగ్ ,కరీనాకపూర్ ,అలియా భట్ ,దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఇక అందులో భాగంగానే మన తెలుగు హీరో అయిన మంచు మనోజ్ కి కూడా ఈ ఈవెంట్ కి ఆహ్వానం అందడంతో ఆయన తన భార్యతో కలిసి ఈ ఈవెంట్ కి హాజరు అవ్వడం జరిగింది. నిజానికి మనోజ్ ప్రస్తుతం బయట ఎక్కడ కూడా ఎక్కువ గా కనిపించడం లేదు. కానీ భారతదేశం లోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ నుంచి ఆహ్వానం అందడంతో తన భార్య తో కలిసి ఈవెంట్ కి వెళ్లి అంబానీ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది.ఇక ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…

    అయితే మంచు మనోజ్ కెరియర్ మొదట్లో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బిందాస్ , ఝుమ్మంది నాదం ,వేదం లాంటి సినిమాలతో నటుడిగా తన స్థాయి నటన ఏంటో జనానికి తెలిసేలా చేశాడు. కానీ ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం, అలాగే తను మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో కెరియర్ పరంగా కొంతవరకు డిస్టర్బ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత తన మొదటి భార్య కు విడాకులు ఇచ్చి ప్రస్తుతం భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకొని మళ్లీ కెరియర్ ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.ఇక మొన్నటి వరకు మంచు మనోజ్ పాలిటిక్స్ లోకి వెళ్తాడు అనే వార్తలు వినిపించినప్పటికీ వాటన్నింటిని కొట్టివేస్తూ ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా మారుతున్నాడు…