Perni Nani: ఏపీలో రేషన్ దందా ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే.దీనిపై పవన్ సీరియస్ గా యాక్షన్ లోకి దిగారు. నేరుగా సముద్రంలోకి వెళ్లి సౌత్ ఆఫ్రికా కు తరలిస్తున్న బియ్యంతో పాటు షిప్ ను పరిశీలించారు. అదే షిప్ ను సీజ్ చేయించారు. అధికారులతో పాటు పోర్టు యంత్రాంగంపై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై కేంద్రహోంమంత్రి అమిత్ షా కు లేఖ కూడా రాశారు. ఈ పరిణామ క్రమంలో ఈరోజు సీఎం చంద్రబాబును కలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం దందాను, తెర వెనుక జరుగుతున్న అక్రమాలు, అధికారుల సహకారం వంటి విషయంలో జరుగుతున్న తతంగాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అటు ప్రభుత్వం సైతం సీరియస్ యాక్షన్ లోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రేషన్ బియ్యం దందాపై ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనే బినామీలను పెట్టి ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ సీరియస్ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని బియ్యం దందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
* మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఆరోపణలు
కొద్ది రోజుల కిందట సౌత్ ఆఫ్రికా కు 35 వేల టన్నుల బియ్యంతో వెళ్తున్న షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అడ్డుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ నేరుగా ఆ షిప్ వద్దకు చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా తాను పోర్టును పరిశీలిస్తానని ముందుకు వస్తే అడ్డుకున్నారని.. దాదాపు పదివేల మంది ఉపాధి పోతుందని చెప్పుకొచ్చారని.. ఇదంతా బియ్యం మాఫియా చేస్తున్న నాటకం అని సంచలన ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు కట్టడి చేయకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేశారు. వైసిపి హయాం నుంచి బియ్యం దందాకు అలవాటు పడిన వారే.. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు పవన్. ప్రధానంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ బినామీలను పెట్టి బియ్యం తరలిస్తున్నారని ఆరోపించారు పవన్. దానికి ఈరోజు మాజీమంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంచలన ఆరోపణలు చేశారు.
* 42 వేల టన్నుల బియ్యం మాటేంటి
35 వేల టన్నులతో దొరికిన షిప్ లో ఉన్న బియ్యం 35 మంది వ్యాపారులదని తేల్చి చెప్పారు. కేవలం ఈ షిప్ వరకే పవన్ వెళ్లారని.. కానీ 42 వేల టన్నులతో మరో షిప్ ఉందని.. దాని జోలికి మాత్రం వెళ్లలేదని ఆక్షేపించారు. అది అక్షరాల ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడుదని ఆరోపించారు. ఆయన పేరు వేల్పుల శ్రీను అని కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియాకు తెలుసునని కూడా అన్నారు పేర్ని నాని. ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు షిప్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ ని కరివేపాకు లాగా ఎలక్షన్ కి వాడుకొని వదిలేస్తారా? – మాజీ మంత్రి పేర్ని నాని #PerniNani #Pawankalyan #Kakinada pic.twitter.com/PAYf2yHLBS
— greatandhra (@greatandhranews) December 2, 2024