Pelli SandaD: ఓటిటిలో సందడి చేయనున్న పెళ్లి సందD.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.

Pelli SandaD: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా పెళ్లి సందD.ఈ సినిమా ఆర్కా మీడియా సంస్థ‌తో క‌లిసి ఆర్కే ఫిలింస్ నిర్మాణ సంస్థ నిర్మించాయి ఈ మూవీ లో తొలిసారిగా న‌టించారు ద‌ర్శ‌కేంద్రుడు. అయితే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది.విడుదలైన‌ ప‌దిరోజుల్లో అటు ఇటు గా 7.15 […]

Written By: Raghava Rao Gara, Updated On : November 4, 2021 11:20 am
Follow us on

Pelli SandaD: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ శ్రీలీల జంటగా తెరకెక్కిన సినిమా పెళ్లి సందD.ఈ సినిమా ఆర్కా మీడియా సంస్థ‌తో క‌లిసి ఆర్కే ఫిలింస్ నిర్మాణ సంస్థ నిర్మించాయి ఈ మూవీ లో తొలిసారిగా న‌టించారు ద‌ర్శ‌కేంద్రుడు.

అయితే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ గా నిలిచింది.విడుదలైన‌ ప‌దిరోజుల్లో అటు ఇటు గా 7.15 కోట్లు వసూళ్లు రాబట్టింది అట. ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం శ్రీలీల అందాలతో యూత్ ను ఫిదా చేశారు చెప్పవచ్చు.

ఈ సినిమా త్వరలో ఓటిటి లో కూడా సందడి చేయనుంది.అయితే ఈ ఫిలిం కి ‘ఆహా’ ఓటిటి వారు రూ.4.5 కోట్ల డిజిటల్ ఆఫర్ ఇచ్చారుట కానీ మేకర్స్ వారు థియేటర్ లో నే రిలీజ్ చేయాలని పట్టుదల చూపార‌ట‌.త్వ‌ర‌లోనే ఓటీటీ వేదికైన
డిస్నీ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 19న లేదా నవంబర్ 26 నుండీ డిస్నీ+హాట్ స్టార్‌లో పెళ్ళిసందD’ సందడి చేయనుంది. థియేటర్ల లో ఈ సినిమాని చూడలేని ప్రేక్షకులు కుటుంబ సభ్యులుతో ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో చూడవచ్చు.