Jai Bhim: అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన జై భీమ్‌కు దేశవ్యాప్తంగా మంచి టాక్ వస్తోంది. ఈ చిత్రంలో సూర్య తన నటనతో ప్రేక్షకులను అలరించారు అనే చెప్పాలి. స్వతహాగా సూర్య విభిన్న పాత్రలు ఎంచుకొని తనదైన శైలిలో ఆ పాత్రకు న్యాయం చేయగలరు. అంతే అవలీలగా నటించగలరు కూడా. సూర్య,దర్శకుడు జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం “జై భీమ్ ” ఈ సినిమా 2డీ ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద స్వయంగా సూర్యనే నిర్మించడం విశేషం.
తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక లాకప్ డెత్ ఆధారంగా కథను అల్లుకుని ఎంతో పకడ్బందీగా తెరకెక్కించారు.ఐతే తెరమీద సూర్య హీరో అయితే.. రియల్ హీరో మాత్రం న్యాయవాది మరియు న్యాయమూర్తి చంద్రు. సూర్య పోషించింది ఈయన పాత్రే కావడం విశేషం. ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ గురించి తెలుసుకుని కదిలిపోయి అతడికి, తన కుటుంబానికి న్యాయం చేయడానికి అలుపెరగని పోరాటం ఈ చిత్రం.
చంద్రు న్యాయవాద వృత్తి మరియు న్యాయమూర్తిగా కూడా 96 వేలకు పైగా కేసులను పరిష్కరించారు అట ఆయన న్యాయవాదిగా పని చేసినప్పుడు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదుట గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ల కోసం వాదించి వారికి న్యాయం చేశాసి ఎంతోమందికి నష్ట పరిహారాలు అందేలా చూశారు అంతే కోర్టులో జడ్జి నుద్దేశించి మై లార్డ్ అనే పదాన్ని కూడా తనవరకు నివారించారుట. అలాగే న్యాయమూర్తిగా అనేక తీర్పులు ఇచ్చారట అందులో భాగంగా మహిళలు దేవాలయాల్లో పూజారులుగా వ్యవహరించవచ్చని, కులం ఏదైనా అందరికీ ఒకే శ్మశానం ఉండాలని, దళితులకు శ్మశానంలో వేరే స్థలం కేటాయించడం నిషిద్ధమని.. ఇలా విప్లవాత్మక తీర్పులెన్నో ఇచ్చారు చంద్రు. ఆయన వాదించిన ఒక సంచలన కేసు ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘జై భీమ్’.