రేటింగ్ : 2
నటీనటులు : రోషన్, శ్రీలీల, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వ పర్యవేక్షణ – రాఘవేంద్రరావు
దర్శకత్వం -గౌరీ రోనంకీ
మాటలు – శ్రీధర్ సిపాన,
సంగీతం – కీరవాణి,

నిర్మాతలు – శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా వచ్చిన సినిమా “పెళ్లి సందD”.
బిగ్గెస్ట్ హిట్ అయిన పెళ్లి సందడికి కొత్త వెర్షన్ గా ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
వశిష్ట (రోషన్) ఫుట్ బాల్ ప్లేయర్. విల్ పవర్ ను నమ్మే అతను తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రి (రావు రమేష్)తో ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలో తన బ్రదర్ పెళ్ళికి వెళ్తాడు. అక్కడ సహస్ర (శ్రీలీల)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా వశిష్టను చూసి ప్రేమిస్తోంది. ఇక ఈ మధ్యలో జరిగిన అనేక సంఘటనల అనంతరం వీరి ప్రేమ కథలో కొన్ని మలుపులు వస్తాయి. ఆ మలుపులు కారణంగా వీళ్ళ లవ్ స్టోరీకి వచ్చిన సమస్య ఏమిటి ? చివరకు వశిష్ట తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశాడు ? అసలు వీరిద్దరి జర్నీ ఎలా మొదలైంది ? వశిష్ట అనుకున్నది సాధించాడా ? లేదా ? చివరకు ప్రేమలో కూడా ఎలా సక్సెస్ అందుకున్నారు ? అనేదే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్.. లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు.
సరదాగా ఉండే ఓ కుర్రాడి పాత్రలో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో రోషన్ బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకండాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే సన్నివేశంలో గాని రోషన్ చాలా బాగా నటించాడు.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ లీల కూడా తన నటనతో ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. అయితే మేకర్స్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను మాత్రం రాసుకోలేదు.
హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ తాలూకు సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉండవు. దీనికి తోడు కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా సాగుతాయి. ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని ప్రయత్నం చేసినా.. ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని వర్కౌట్ కాలేదు.
ప్లస్ పాయింట్స్:
స్టోరీ లైన్,
నటీనటుల నటన,
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే,
డైలాగ్స్,
డైరెక్షన్,
ఫేక్ ఎమోషన్స్ తో సాగే సిల్లీ డ్రామా.
స్లో నేరేషన్,