Actress Sri Leela: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న పెళ్లిసందD బ్యూటీ … శ్రీలీల

Actress Sri Leela: శ్రీ లీల… ఇటీవల విడుదలైన ” పెళ్లి సందD ” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో… ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై… కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు ఈ కిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోష‌న్ ఈ మూవీలో హీరోగా నటించాడు. అలానే రాఘవేంద్రరావు కూడా […]

Written By: Raghava Rao Gara, Updated On : October 24, 2021 11:14 am
Follow us on

Actress Sri Leela: శ్రీ లీల… ఇటీవల విడుదలైన ” పెళ్లి సందD ” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో… ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై… కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు ఈ కిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోష‌న్ ఈ మూవీలో హీరోగా నటించాడు. అలానే రాఘవేంద్రరావు కూడా ఓ కీలకపాత్రలో మొదటిసారి తెరముందు కనిపించి అదరగొట్టారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం మరో హైలైట్ అని చెప్పాలి.

అయితే ఇప్పుడు శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. పెళ్లి సందD సినిమాలో నటించినందుకు శ్రీలీలకు మంచి పేరొచ్చింది అనే చెప్పాలి. చూడడానికి అందంగా కనిపించడంతో పాటు… నటన, డాన్స్ లతో కూడా ఈ భామ అదరగొట్టింది. దీంతో రవితేజ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయిందని అంటున్నారు. అంతేకాదు కుర్ర హీరోలు శ్రీలీల హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట. దీంతో ఇప్పటికే ఈ శ్రీలీల చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం. యంగ్ హీరోలు కూడా ఆమెనే హీరోయిన్‌గా కావాలని అడుగుతున్నారంట. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. గతంలో కృతి శెట్టి ఉప్పెన సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇప్పుడు ఈ పెళ్లి సందD సినిమాతో శ్రీలీలకు కూడా అలానే కలిసొచ్చిందని అనుకుంటున్నారు.