Peddi vs Paradise: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు గతంలో ఉప్పెన లాంటి సినిమా చేశాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రామ్ చరణ్ సైతం ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. గత సంవత్సరం చేసిన గేమ్స్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికి తన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. దాంతో పెద్ది సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి మరోసారి తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఇదే సమయంలో నాని లాంటి హీరో సైతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల – నాని కాంబినేషన్లో ఇంతకుముందు దసర సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి నాని శ్రీకాంత్ ఓదెలకు అవకాశాన్ని ఇచ్చాడు. శ్రీకాంత్ సైతం ఆ అవకాశాన్ని వాడుకుంటూ ప్యారడైజ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే పెద్ది – ప్యారడైజ్ రెండు సినిమాలు సైతం మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున ప్రేక్షకులు అందించబోతున్నాయి అంటూ గతంలో వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సైతం తమ రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది…
ఈ సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ ని సాధిస్తుంది… ఏ మూవీ డీలా పడిపోతుంది అనేదే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక బుచ్చిబాబు – శ్రీకాంత్ ఓదెలా ఇద్దరు కూడా సుకుమార్ శిష్యులే కావడంతో ఈ రెండు సినిమాల మీద భారీ హైప్ క్రియేట్ అయింది… ఇక ఈ మూవీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా రెండిటి మధ్య పోటీ అయితే ఉంటుంది.
ఇందులో ఏ మూవీ విజయాన్ని సాధిస్తుంది ఏది అపజయాన్ని మూట గట్టుకుంటుంది అనే విషయం మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే అటు బుచ్చిబాబు ఇటు శ్రీకాంత్ ఓదెల ఇద్దరు నువ్వా నేనా అనే ఒక పోటీ వాతావరణంలో సినిమాలను చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను మూటగట్టుకుంటాయి అనే దాని మీదనే ప్రతి ఒక్కరి దృష్టి ఉంది…