Peddi vs Dragon : తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం డామినేట్ చేస్తూ మనవాళ్లు క్రియేట్ చేస్తున్న వండర్స్ అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీని పరిచయం చేశాడో అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోలందరు వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) లాంటి నటుడు సైతం బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడుతుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అంటూ చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాలతో రామ్ చరణ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : అమీర్ ఖాన్ ఆశలపై నీళ్లు జల్లిన జూనియర్ ఎన్టీఆర్..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన కెరీర్ మొదట్లోనే ఆది(Aadi), సింహాద్రి ( Simhadri) లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన మాస్ ప్రేక్షకుల పల్స్ ను పట్టుకున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు తన నటనలో పరిణితిని చూపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన లాంటి నటుడు మరి ఎవరు లేరు అనేంతలా ప్రతి క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటిస్తాడు. ఎలాంటి పాత్రనైనా సరే అలవోక గా చేసి మెప్పించ గలిగె కెపాసిటీ ఉన్న నటుడు కూడా ఎన్టీఆరే కావడం విశేషం…
ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ (డ్రాగన్ Dragon) సినిమాకు పెద్ది మూవీ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా ఏ హీరో స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడు.
ఇక పాన్ ఇండియాలో వాళ్లను మించిన స్టార్ హీరోలు మరెవరు లేరా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు టాప్ పొజిషన్ ను దక్కించుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…