Homeఎంటర్టైన్మెంట్Peddi replacing Toxic movie: 'టాక్సిక్' స్థానంలో 'పెద్ది'.. ఈ వారమే అభిమానులకు సంచలన ప్రకటన..

Peddi replacing Toxic movie: ‘టాక్సిక్’ స్థానంలో ‘పెద్ది’.. ఈ వారమే అభిమానులకు సంచలన ప్రకటన..

Peddi replacing Toxic movie: ఏ ముహూర్తాన ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రాన్ని మొదలు పెట్టారో కానీ , అడుగడుగునా ఈ చిత్రానికి అడ్డంకులే. నిర్మాణ దశలోనే ఈ చిత్రం ఎన్నో అడ్డంకులను ఎదురుకోవాల్సి వచ్చింది . హీరో యాష్ కి ఏ షాట్ కూడా ఒక పట్టాన నచ్చకపోవడం , పదే పదే రీ షూట్స్ చేయడం వల్ల ఈ చిత్రం బడ్జెట్ పెరగడం తో పాటు, సమయం కూడా బాగా వృధా అయ్యింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి 19 న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ పర్ఫెక్షన్ కోసం ఇంకా ఎక్కువ సమయం కోరుతూ , ఈ చిత్రాన్ని జూన్ 4 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా రావడం లేదని అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. దీంతో ఇప్పుడు ఈ స్థానం పై ‘పెద్ది'(Peddi Movie) మూవీ టీమ్ కన్నేసింది.

ముందుగా ‘పెద్ది’ మూవీ టీం ‘టాక్సిక్’ చిత్రం వాయిదా పడుతుందని అంచనా వేసి , మా చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అంటే ‘టాక్సిక్’ చిత్రం వాయిదా పడగానే ‘పెద్ది’ చిత్రాన్ని జూన్ 4 న విడుదల చేయబోతున్నట్టు అధికార ప్రకటన చేయడానికే గ్రౌండ్ మొత్తం సెట్ చేసుకున్నారు అన్నమాట. రేపటి తో ‘పెద్ది’ మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. మరోపక్క AR రెహమాన్ ఈ చిత్రం సెకండ్ హాఫ్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 15 లోపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఈ వారం లోనే ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే , మెగా ఫ్యాన్స్ ని ఇప్పుడు ఒక సెంటిమెంట్ తెగ కలవరపెడుతోంది. అదేంటంటే మార్చి 19 నుండి ‘టాక్సిక్’ చిత్రం వాయిదాపడినప్పుడు, మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మార్చి 19 కి ప్రీ పోన్ చేశారు. ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ‘టాక్సిక్’ విడుదల అవ్వాల్సిన తేదీలో ‘పెద్ది’ చిత్రం విడుదల అవ్వబోతుంది. అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెంటిమెంట్ రిపీట్ కానుందా?, పైగా రెండు చిత్రాలకు కూడా ఒకరే నిర్మాత అంటూ సోషల్ మీడియా లో కొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version