Robots replacing human jobs future: అది చైనా.. ఇటీవల అక్కడ ఒక పరుగు పందెం పోటీ నిర్వహించారు. అందులో రోబోలు పాల్గొన్నాయి. ఆ రోబోలు మనుషుల కంటే వేగంగా పరుగుపెట్టాయి. చివరికి మనుషుల మీద విజయం సాధించాయి.. తొలి మూడు స్థానాలలో రోబోలు నిలిచాయి. దీనిని బట్టి రోబోలు.. మనుషుల మీద భవిష్యత్తు కాలంలో పై చేయి సాధిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.
హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రి.. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు వేలాది మంది రోగులు వస్తుంటారు.. ఆ రోగులకు సమాచారాన్ని అందించడం అత్యంత కష్టమైన పని. కొన్ని సందర్భాలలో రోగులకు సమాచారం ఇవ్వడంలో రిసెప్షనిస్టులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రోగులకు సత్వర సేవలు అందించడానికి నిమ్స్ యాజమాన్యం సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఏకంగా రోబోను రంగంలోకి దింపింది. పది లక్షల ఖర్చుతో రోబోను తయారుచేసి.. దానిని రిసెప్షనిస్టుగా పెట్టుకుంది. దీంతో రోగులకు సత్వరంగా సేవలు అందుతున్నాయి..
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. మనుషుల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులు చేయలేని పనులను రోబోలు చేస్తున్నాయి.. ఇప్పుడు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తెరపైకి రావడంతో రోబోలలో ఆ టెక్నాలజీ వాడుతున్నారు. ఫలితంగా అవి ఎన్నో రకాల పనులు చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి మొదలు పెడితే భూగర్భం వరకు ప్రతి పనిలోనూ రోబోల వాడకం పెరిగిపోయింది. అందువల్లే భవిష్యత్తు కాలం మొత్తం రోబోలతోనే సాగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
కొన్ని సంక్లిష్టమైన పనులను.. రోబోలు చేస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో మరింత సంక్లిష్టమైన పనులను రోబోల ద్వారా చేయించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అందుబాటులోకి రావడంతో.. రోబోలలో వాటిని పొందుపరిచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్లే యుద్ధాలలో కూడా రోబోలను వాడుతున్నారు. కాకపోతే ఆయుధాల తయారీ.. మనుషులు చేయలేని పనులను వాటితో చేయిస్తున్నారు.. జపాన్, చైనా, అమెరికా, ఇజ్రాయిల్, ఇండియా వంటి దేశాలలో రోబోల మీద రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.. వీటిని మానవ జాతి అభ్యున్నతికి మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల ఆవిష్కరణలలో ఉపయోగిస్తున్నారు.. చూడబోతే భవిష్యత్తు కాలం మొత్తం కూడా రోబోల దే అనిపిస్తోంది. చైనాలో వ్యవసాయ పనులకు కూడా రోబోలను వాడుతున్నారు. రోబోలు మనుషులకంటే ఎక్కువగా పనిచేస్తాయని.. తద్వారా వ్యవసాయ ఉత్పత్తి అధికంగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు..
రోబోల వినియోగం ఒక స్థాయి వరకు ఉంటే సరిపోతుందని.. అది పరిమితికి మించి పోతే ఐ రోబో సినిమా రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు.
#Hyderabad:#AIRobot as #HospitalReceptionist
A new wave of #technology has arrived at Nizam’s Institute of Medical Sciences (#NIMS) in Hyderabad.
The hospital has introduced an AI-powered robot as a receptionist to assist #patients.
The #robot provides quick and accurate… pic.twitter.com/N94bgk51ZC
— NewsMeter (@NewsMeter_In) April 28, 2026