Peddi Overseas Bookings: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ లో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. పైగా డిజాస్టర్లు ఎక్కువ, యావరేజ్ గా ఆడిన సినిమాలు పట్టుమని రెండు మూడు కూడా లేవు. బయ్యర్స్ చేతుల్లో డబ్బులు లేవు , థియేటర్స్ మూతలు పడుతున్నాయి. ఇంతటి ఘోరమైన కరువు ‘పెద్ది’ తర్వాత మాయం అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ విశ్లేషకులు. జూన్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ కంటే ట్రేడ్ వర్గాలే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టారు మేకర్స్ .
అభిమానుల్లో ఈ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. ఓజీ, దేవర , పుష్ప 2 , కల్కి రేంజ్ బుకింగ్స్ కచ్చితంగా జరుగుతాయని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు , చాలా భిన్నంగా ఉంది. ముఖ్యంగా నార్త్ అమెరికా విషయానికి వస్తే , బుకింగ్స్ చాలా బలహీనంగా ఉన్నాయి. ఇలా ఉంటుందని అసలు ఎవ్వరూ ఊహించలేదు. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందించిన లెక్కల ప్రకారం ఈ చిత్రానికి బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లో 1 లక్షా 47 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షోస్ దాదాపుగా వెయ్యికి పైగానే షెడ్యూల్ చేశారు. ఈ రేంజ్ షోస్ షెడ్యూల్ చేసిన తర్వాత , పెద్ది స్థాయి భారీ హైప్ ఉన్న సినిమాలకు ఈపాటికే 5 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి.
‘ఓజీ’ , ‘సలార్’, ‘దేవర’, ‘కల్కి’ వంటి చిత్రాలకు అలాగే వచ్చాయి. కానీ ‘పెద్ది’ కి ఎందుకు ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఇక 48 గంటలు గడిచిన తర్వాత ‘పెద్ది’ చిత్రానికి కేవలం 1 లక్షా 72 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే ముందు రోజుతో పోలిస్తే కేవలం 28 వేల డాలర్లు మాత్రమే పెరిగాయి అన్నమాట. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఓజీ చిత్రానికి 48 గంటల్లో 5 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు ఏకంగా 2 లక్షల 47 వేల డాలర్ల గ్రాస్ పెరిగింది. ఈ రేంజ్ లో కనీసం పావు శాతం కూడా లేకపోవడం బాధాకరం. అయితే ప్రస్తుత బుకింగ్స్ ఎలా ఉన్నా, థియేట్రికల్ ట్రైలర్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి , చూడాలి మరి ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుంది అనేది .