Peddi Movie Scenes Removed Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసుకుంది. రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కానీ , కొన్ని సన్నివేశాలను మాత్రం ఆడియన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ట్రాక్ ని తిట్టనోళ్లు ఎవరూ మిగిలి లేరు అనడంలో అతిశయోక్తి లేదు. జాన్వీ కపూర్ అందాల ఆరబోత ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే కాదు , చూసే యూత్ ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగించింది.
అందుకే ఈ సన్నివేశాలు కొన్ని ట్రిమ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్ కూడా కథ ఫ్లో కి అడ్డంగా మారినట్టు రివ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ని కూడా తొలగించే పనిలో ఉన్నారట. వీటి బదులుగా రెండు సన్నివేశాలను అదనంగా జత చేస్తారట. అందులో హీరో ఢిల్లీ వెళ్ళినప్పుడు , ఒక సందర్భంలో భారీ ఫైట్ సన్నివేశం వస్తుంది , దానిని నిడివి దృష్ట్యా ఎడిటింగ్ లో కత్తిరించాల్సి వచ్చిందట. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని జత చేయబోతున్నట్టు సమాచారం. అదే విధంగా ఫస్ట్ హాఫ్ లో అప్పలసూరి పాత్ర పోషించిన జగపతి బాబు తండ్రి , ప్రయాణ సౌకర్యం లేక చనిపోయే సన్నివేశం ఒకటి ఉంటుందట. అది చాలా ఎమోషనల్ గా ఉంటుందని , కానీ నిడివి దృష్ట్యా ఆ సన్నివేశాన్ని కూడా తొలగించాల్సి వచ్చిందని బుచ్చి బాబు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని కూడా జత చేయబోతున్నట్టు సమాచారం.
ఇలా ఈ సినిమాలోని ఈ చిన్న మార్పులతో సోమవారం నుండి అందుబాటులోకి వస్తుందని , ఈ మార్పుల కారణంగా ఈ చిత్రానికి ఇంకా మంచి టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ఇకపోతే రెండవ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లను నమోదు చేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒక్క సీడెడ్ ప్రాంతం నుండే ఈ చిత్రానికి రెండవ రోజున 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. చూడాలి మరి లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతోంది అనేది.
