Peddi movie story: ‘గేమ్ చేంజర్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ బాంబు లాగా పేలింది. సినిమా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పడానికి ఇంతకు మించి ఏమి కావాలి చెప్పండి?, నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి కూడా బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ లోని కుస్తీ ఫైట్, అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే వాయిస్ ఓవర్ విన్న తర్వాత, సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ సినిమా స్టోరీ పై విశేల్షనాలు ఇవ్వడం మొదలు పెట్టారు.
కుస్తీ ఆడమని రామ్ చరణ్ ని సవాలు చెయ్యడం, అందుకు రామ్ చరణ్ ఆట నే నా పొగరు అని సమాధానం ఇవ్వడం వంటివి చూస్తుంటే, ఈ సినిమా స్టోరీ రొటీన్ గానే ఉన్నట్లుగా అనిపిస్తుందే అంటూ కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో గా నటించిన ‘సినిమా చూపిస్తా మామా ‘ అనే సూపర్ హిట్ మూవీ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ చిత్రం లో హీరో రాజ్ తరుణ్ అల్లరి చిల్లర గా తిరుగుతూ, హీరోయిన్ ని ప్రేమిస్తాడు. హీరో బాధ్యత తెలియని వ్యక్తి కాబట్టి , అతనికి హీరోయిన్ తండ్రి ప్రయోజకుడివి అని నిరూపించుకుంటే నా కూలుతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అనే షరతు పెడుతాడు. ఆ సవాల్ ని స్వీకరించి , ప్రయోజకుడిగా మారి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. ‘పెద్ది’ మూవీ స్టోరీ కూడా ఇలాగే ఉండబోతుందా అని అంటున్నారు విశ్లేషకులు.
టీజర్ చూస్తుంటే ఇందులో హీరోయిన్ జాన్వీ కపూర్ కి తండ్రిగా కన్నడ సూపర్ స్టార్ నటించినట్టు తెలుస్తోంది. ఈయన తన కూతురికి కుస్తీ పోటీల్లో నిష్ణాతుడుకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు. కానీ రామ్ చరణ్ క్రికెట్ ఆటగాడు. కాబట్టి మొదట్లో వీళ్ళ ప్రేమకు అంగీకారం తెలపడని, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే కుస్తీ పోటీల్లో గెలవాలి అనే షరతు ఆమె తండ్రి పెడతాడని, రామ్ చరణ్ ఆ షరతు ని అంగీకరించి కుస్తీ పోటీలకు రెడీ అయ్యి , ఎవ్వరూ ఊహించని రీతిలో పోరాడి గెలిచి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడని , ఇలా రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. కానీ అసలు స్టోరీ అది కాదని, చివరి 40 నిమిషాలు ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరూ చూసి ఉండరని, తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా, నార్త్ ఇండియన్స్ కూడా మెంటలెక్కిపోతారని అంటున్నారు మెగా ఫ్యాన్స్. చూడాలి మరి ఏది నిజం అవ్వబోతుంది అనేది.