Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం గురించి సోషల్ మీడియా లో లీక్ అవుతున్న వార్తలు చూస్తుంటే మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దంగల్ ని మించిన సినిమా రాబోతుంది అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. రామ్ చరణ్ అభిమానులు రికార్డ్స్ పరంగా మాత్రమే కాదు, తమ అభిమాన హీరో నటన గురించి కూడా మరోసారి గర్వం గా కాలర్ ఎగరేసేలా ఉంటుందట ఈ చిత్రం. ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘చికిరి చికిరి’ పాటకు అయితే గ్లోబల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. భాషతో సంబంధం లేదు, వయస్సు తో సంబంధం లేదు, ప్రతీ ఒక్కరు ఈ పాటలోని హుక్ స్టెప్ ని అనుకరిస్తూ రీల్స్ ని అప్లోడ్ చేస్తున్నారు.,
ఈ రేంజ్ రీచ్ ఒక స్టార్ హీరో పాటకు ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా రాలేదు. కేవలం తెలుగు వెర్షన్ పాటకే యూట్యూబ్ లో 167 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ కూడా రోజుకి 1 మిలియన్ కి పైగా వ్యూస్ తో అసాధారణమైన ట్రెండ్ ని చూపిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ ఏప్రిల్ 30 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రామ్ చరణ్ ఒలంపిక్స్ గేమ్ లో పాల్గొని ఇండియా కి గోల్డ్ మెడల్ సాధించి తన ఊరి పేరుని ప్రపంచం మొత్తం మారుమోగిపోయేలా చేస్తాడట.
పూర్తి స్టోరీ లోకి వెళ్తే ఒక మారుమూల గ్రామం లో అన్ని ఆటల్లోను ఆరితేరిన కుర్రాడు పెద్ది. ఊరిలో అద్దె ఆటగాడిగా ఇతన్ని అందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇతనిలో అద్భుతమైన టాలెంట్ బయటకు వస్తే, ఎక్కడ మమ్మల్ని అందరినీ దాటేస్తాడో అనే భయం తో, ఎన్నో కుట్ర రాజకీయాలు చేసి పెద్ది ని తొక్కేయాలని చూస్తారు. కానీ వాటి అన్నిటిని దాటుకొని, ఏకంగా ఒలింపిక్స్ లోకి అడుగుపెట్టి, ఇండియా కి గోల్డ్ మెడల్ ఎలా తీసుకొచ్చాడు అనేదే స్టోరీ అట. ఈ చిత్రం లో ఫన్ ఉంటుంది , ఎమోషన్ ఉంటుంది, రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉద్వేగభరిత సన్నివేశాలు కూడా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది దంగల్ కి మించిన సినిమా అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు మాత్రం ఇండియన్ మూవీ లవర్స్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుందట.