Nagabandham Movie Teaser: ఈమధ్య కాలం లో చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో తమ సినిమాలను విడుదల చేసి వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొటున్నారు. అప్పట్లో పెద్ద హీరోల సినెమాలదే రాజ్యం. ఇప్పుడు పెద్దా లేదు, చిన్నా లేదు, కంటెంట్ ఉన్నవాడే కింగ్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కనీసం ఊరు పేరు తెలియని హీరోలకు కూడా కంటెంట్ మీద నమ్మకంతో వంద కోట్ల బడ్జెట్ ని కుమ్మరిస్తున్నారు. అలా ఒక కొత్త హీరో పై వంద కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసి అభిషేక్ నామా దర్శకత్వం వహించిన చిత్రం ‘నాగ బంధం’. నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేత లాంచ్ చేయించారు మేకర్స్. అనంత పద్మనాభ స్వామి ఆలయాళం లోని మిస్టరీ ఆధారంగా తీసిన అడ్వెంచర్ చిత్రమిది.
ఈ టీజర్ ని చూస్తున్నంత సేపు విజువల్ గా చాలా రిచ్ గా అనిపించింది. ప్రతీ ఫ్రేమ్ చాలా క్వాలిటీ గా కనిపించింది. ముఖ్యంగా కొన్ని షాట్స్ ని వెండితెర పై చూస్తే గూస్ బంప్స్ ఫీలింగ్స్ కలిగించేలా అనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో హీరో గా నటిస్తున్న కొత్త కుర్రాడి పేరు విరాట్ కర్ణ. ఇది అతనికి మొదటి సినిమానే అయినప్పటికీ చాలా షాట్స్ లో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ని పలికించాడు. ముఖ్యంగా మహాశివుడి లుక్ లో నేటి తరం స్టార్ హీరోలు కూడా గొప్పగా అనిపించరు. అలాంటిది విరాట్ చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. గెటప్ అయితే సూట్ అయ్యింది కానీ, మహా శివుడి లోని ఉగ్రరూపాన్ని ప్రదర్శించడానికి మాత్రం టీజర్ లో చూపించిన ఇంటెన్సిటీ అయితే సరిపోదు. సినిమాలో ఎలా చూపించి ఉంటారో చూడాలి. ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటించారు.
ఇక ఈ సినిమా కథ విషయం లోకి వెళ్తే కేరళ లోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో ఎన్నో వందల సంవత్సరాల క్రితం ‘వాల్ట్ B’ అనే గదిలో లక్షల కోట్ల విలువ గల ఖజానా ని దాచి పెట్టి ఉంచారు. ఈ గది తలుపులు తెరవడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు కానీ, ఎవరి వల్ల కాలేదు. ఆరోజుల్లోనే శబ్ద ధ్వని ఆధారంగా ఈ డోర్ ని లాక్ చేయబడింది అట. గరుడ మంత్రాన్ని ఆరోజుల్లో ఎలాంటి ఇంటెన్స్ వేవ్ లెంగ్త్ తో పలికి ఈ డోర్ ని లాక్ చేశారో , అదే ఇంటెన్సిటీ తో గరుడ మంత్రాన్ని చదివితే కానీ ఈ డోర్ తెరుచుకోదు. అలాంటి డోర్ ని హీరో ఓపెన్ చేయడం, లోపలకు వెళ్లిన తర్వాత ఎన్నో విష సర్పాలను దాటుకొని నిధి వద్దకు ఎలా చేరుకున్నాడు అనేదే స్టోరీ. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. సరైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని తీసి ఉండుంటే మాత్రం, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
