Peddi movie director Buchi Babu apology: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ని చూస్తుంటే , భవిష్యత్తులో కచ్చితంగా ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా, కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి , క్రిటిక్స్ నుండి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ సన్నివేశాలపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఒక అమ్మాయిని ఇంత నీచంగా చూపిస్తారా ?, పెద్ది టీం కి స్త్రీల మీద ఉన్న గౌరవం ఇదేనా అంటూ సోషల్ మీడియా లో డైరెక్టర్ బుచ్చి బాబు పై విరుచుకుపడ్డారు. అయితే సోషల్ మీడియా నుండి వస్తున్న ఈ విమర్శలపై బుచ్చి బాబు ట్విట్టర్ ద్వారా రెస్పాన్స్ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఒక ఫిలిం మేకర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలి, వాళ్ళని సినిమా తో ఉత్తేజపరచాలి అని బలంగా నమ్మేవారిలో ఒకరిని నేను. కానీ వినోదాన్ని పంచే క్రమం లో ఎవరినీ కూడా అసౌకర్యానికి గురి చెయ్యకూడదు. పెద్ది చిత్రం లోని కొన్ని సన్నివేశాలకు ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని మేము తీసుకున్నాము. ఈ సందర్భంగా మీకు నేను చెప్పాలని అనుకున్నది ఏమిటంటే , మహిళలపట్ల నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంటుంది, ఏ స్త్రీ పాత్రని కూడా ఒక వస్తువుగా చూపించడం కానీ , వాళ్ళని అగౌరవపరచడం కానీ నా ఉద్దేశ్యం కాదు.కానీ కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురి చేశాయని తెలుస్తోంది, నా వల్ల బాధపడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’.
‘సోషల్ మీడియా లో వచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న మేము , ఆ సన్నివేశాలను ట్రిమ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు బుచ్చి బాబు. పెద్ది మూవీ ఫస్ట్ హాఫ్ లో హీరో రామ్ చరణ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం , ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అందుకు హీరో హీరోయిన్ కి వివరణ ఇవ్వడం చూసి ఆడియన్స్ ఛీ కొట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తిట్టే తిట్లకు చెవులు మూసుకోవాల్సిందే. ఒక మంచి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం దృఅదృష్టకరం , ఆ సన్నివేశాల వల్ల, గొప్ప సందేశాక చిత్రం పొల్యూట్ అయ్యిందని , ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
As a filmmaker, I believe cinema should entertain, inspire, and connect with audiences. It should never make anyone feel uncomfortable or disrespected. We have heard the feedback regarding certain scenes in Peddi and have taken it seriously.
I have always had immense respect for…
— BuchiBabuSana (@BuchiBabuSana) June 6, 2026
