Peddi Movie Climax: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది(Peddi movie) పై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఏప్రిల్ నెలలో విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది షాట్ అంటూ IPL టైం లో బాగా వైరల్ అయ్యింది. ఇక రీసెంట్ గా అయితే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి.. చికిరి’ పాట అయితే ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వైరల్ అయ్యింది. చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ పాటలోని హుక్ స్టెప్ కి వైబ్ అవుతూ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేశారు.
Also Read: యూ.. చిలిపీ.. ఇలా భయపెడుతావేంటి బాలయ్య!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటి అంటే ఈ మూవీ క్లైమాక్స్ లో రామ్ చరణ్ కి ఒక కాలు తీసేస్తారట. వైకల్యం తోనే ఆయన ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటాడని, ఇండియా కి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ దీన్ని తీసుకోగలరా?, కొత్త తరహా ఆలోచనలను ఆడియన్స్ ఇప్పుడు స్వాగతిస్తున్నారు కాబట్టి ఈ క్లైమాక్స్ ని కూడా స్వాగతించొచ్చు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా మార్చ్ 27 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. రీసెంట్ గానే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తి అయ్యిందట. శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.