Balakrishna: సినిమాల్లోనూ, అదే విధంగా బయట ఎంతో గంభీరంగా కనిపించే బాలయ్య(Nandamuri Balakrishna) లో అప్పుడప్పుడు చిన్న పిల్లాడు బయటకు వస్తుంటాడు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరూ ఊహించలేరని అభిమానులు కూడా అంటుంటారు. కానీ బాలయ్య లోని చిలిపి యాంగిల్ మాత్రం ఆయన అభిమానులకు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా బాగా నచ్చుతుంది. రీసెంట్ గా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆయన హీరో గా నటించిన ‘అఖండ 2’ వచ్చే నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని ఒక భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు.
Also Read: ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్ళేనా..?
ఈ ఈవెంట్ కి హాజరు అయ్యే ముందు బాలయ్య ఒక మీడియా రిపోర్టర్ ని చూసి సింహం లాగా గర్జిస్తూ ఒక ఫోజు పెడుతాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. బాలయ్య లో పసి పిల్లవాడు నిద్ర లేచాడు అంటూ ఆయన అభిమానులు ఈ వీడియో ని షేర్ చేస్తూ చిలిపి బాలయ్య అనే ట్యాగ్ ఇచ్చారు. గతంలో కూడా బాలయ్య ఇలాంటివి చాలానే చేసాడు. అప్పట్లో హైలైట్ అయ్యినట్టుగానే ఇప్పుడు కూడా ఈ వీడియో క్లిప్ బాగా హైలైట్ అయ్యింది. ఇక యాంటీ ఫ్యాన్స్ గురించి తెలిసిందే. బాలయ్య కి మెంటల్, ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, ఇప్పుడు ఆయన టాబ్లెట్స్ వేసుకొని వచ్చినట్టు ఉన్నాడు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య తనలోని ఫన్నీ యాంగిల్ ని బయటకు తీసి మీమర్స్ కి మంచి మీమ్ ని అందించాడు. ఇక రాబోయే రోజుల్లో ప్రతీ సందర్భంలోనూ ఈ వీడియో బిట్ ని మీమ్ గా వాడేస్తారు నెటిజెన్స్.
ఇక అఖండ 2 విషయానికి వస్తే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. ఇక సెకండ్ హాఫ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. రీ రికార్డింగ్ మరియు సౌండ్ మిక్సింగ్ పనుల్లో సంగీత దర్శకుడు థమన్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఇక కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ సెకండ్ హాఫ్ కి సంబంధించి కొంచెం బ్యాలన్స్ ఉందట. ఈ వారం లోనే మొదటి కాపీ ని సిద్ధం చేసి, ఓవర్సీస్ కి హార్డ్ డ్రైవ్స్ పంపేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ బయటకు రానుంది.
Me when i see kids for no reason pic.twitter.com/JNCiYAF5DD
— Arehoo_official (@tweetsbyaravind) November 18, 2025