spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi release date : 'పెద్ది' ఏప్రిల్ 30న రావడం కూడా అసాధ్యమేనా..? పూర్తి వివరాలు...

Peddi release date : ‘పెద్ది’ ఏప్రిల్ 30న రావడం కూడా అసాధ్యమేనా..? పూర్తి వివరాలు చూస్తే ఫ్యాన్స్ కి కన్నీళ్లు ఆగవు!

Peddi release date : మార్చి 27న విడుదల అవ్వాల్సిన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘పెద్ది'(Peddi Movie) చిత్రాన్ని వాయిదా వేస్తూ, ఏప్రిల్ 30న విడుదల చేయబోతున్నట్టు రీసెంట్ గానే ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన రోజే, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ని మార్చి 26 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. రెండు మెగా సినిమాలకు నెల రోజుల గ్యాప్ ఉంది, 2012 వ సంవత్సరం లో కూడా ‘రచ్చ’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలు ఇలాగే నెల రోజుల గ్యాప్ తో విడుదల అయ్యాయి, రెండు సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా లో హంగామా చేశారు. అయితే ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న రావడం దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు.

ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా 40 రోజుల వరకు ఉందట. ఈరోజు నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తే తప్ప, చెప్పిన డేట్ కి రావడం కష్టమని అంటున్నారు. ఎందుకంటే 40 రోజుల షూటింగ్ ని పూర్తి చేయడమే పెద్ద టాస్క్, ఆ తర్వాత ఎడిటింగ్, రీ రికార్డింగ్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి కచ్చితంగా మరో 20 నుండి 30 రోజుల సమయం కావాలి. అయితే రీసెంట్ గానే రామ్ చరణ్ ఇద్దరు కవలపిల్లలకు తండ్రి అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఉపాసన దగ్గర ఉండాల్సిన అవసరం ఉండడంతో, షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టడానికి వారం రోజుల సమయం పట్టొచ్చు. అదే కనుక జరిగితే ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.

మరి బుచ్చి బాబు ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. కొన్ని సన్నివేశాలను సినిమా నుండి తొలగించేస్తాడా?, లేదంటే అధిక వర్కింగ్ హవర్స్ హీరో చేత పని చేయించుకొని సినిమాని పూర్తి చేస్తాడా అనేది ఆసక్తికరమైన అంశం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాటను ఈ శివరాత్రికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ పాటకు 160 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యం లో రెండవ పాటపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ పాట ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular