Peddi Movie 11 Days Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 11 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పెంచిన టిక్కెట్ రేట్స్ మీద నడిచిన ఈ చిత్రం , 11 వ రోజున మామూలు రేంజ్ టిక్కెట్ రేట్స్ తో మొదలైంది. టిక్కెట్ రేట్స్ తగ్గడం వల్ల, ఈ చిత్రానికి నిన్న అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్ బోర్డ్స్ నమోదు అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కిక్కిరిపోయాయి. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 11 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 7 కోట్ల 65 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఓవరాల్ గా 11 వ రోజున ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ప్రాంతాల వారీగా 11 రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 51 కోట్ల 21 లక్షలు , సీడెడ్ ప్రాంతం నుండి 19 కోట్ల 77 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21 కోట్ల 26 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 12 కోట్ల 7 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సంచలనం సృష్టించింది. నైజాం ప్రాంతం లో అయితే 11 వ రోజున కూడా 1 కోటి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే వెస్ట్ గోదావరి నుండి ఈ చిత్రం 11 రోజుల్లో 8 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 6 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 9 కోట్ల 65 లక్షలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ కి కంచుకోట గా పిలిచే నెల్లూరు నుండి 5 కోట్ల 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 210 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు , సీడెడ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కర్ణాటక ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 14 కోట్ల 35 లక్షల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 17 కోట్లు రావాలి. అదే విధంగా తమిళనాడు + కేరళ నుండి 2 కోట్లు , రెస్ట్ అఫ్ ఇండియా + హిందీ కలిపి 11 కోట్ల 10 లక్షలు , ఓవర్సీస్ నుండి 22 కోట్ల 15 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 11 రోజుల్లో 189 కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు 317 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 30 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.
