Homeఎంటర్టైన్మెంట్అభిమానులకి షాక్ ఇచ్చిన 'పాయల్ రాజ్‌పుత్' !

అభిమానులకి షాక్ ఇచ్చిన ‘పాయల్ రాజ్‌పుత్’ !

Payal Rajput Singh
పాయల్ రాజ్‌పుత్ … తొలి సినిమాతోనే హిట్ కొట్టి టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హాట్ అందాలతో , అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది. హాట్‌గా నటించి సెగలు రేపిన ఈ బ్యూటీ.. తన నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. అప్పటివరకు ఏ హీరోయిన్ చేయనటువంటి పాత్రను చేయడంతో ఆ ఒక్క చిత్రంతోనే ఈ అమ్మడు రేంజ్ తారా స్థాయికి చేరింది. అక్కడ నుండి వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ అభిమానులకి హాట్ ఫొటోస్ తో వినోదం పంచుతుంది.

Also Read: అరియనా క్యారెక్టర్ అలాంటిదే… వర్మ సంచలన కామెంట్స్

అయితే తాజాగా తన గురించి మాట్లాడుతూ… నా కెరీర్ ఇపుడు మొగ్గ దశలోనే ఉందని, అందాల ఆరబోతలో హద్దులు దాటబోనని పాయల్ భామ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, ‘నా తొలిచిత్రం “ఆర్‌ఎక్స్‌ 100″ విడుదల తర్వాత అందరూ నన్ను సొంత అమ్మాయిలా, ఓ రాణిలా చూశారు. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉంది. ‘వెంకీ మామ’ విజయంతో నా పట్ల వాళ్ల అభిమానం రెట్టింపైంది” అని చెప్పింది. టాలీవుడ్ నాకు మరో పుట్టినిల్లుగా భావిస్తున్నాను. ఇంతటి అభిమానం, ఆదరణ చూపిస్తున్న తెలుగు ప్రజలని నేను ఎప్పటికి మరచిపోను.

Also Read: తిరిగి ఇచ్చేయాలి… లేదంటే బ్యాడ్ అయిపోతాం

మొదటి సినిమాలో నన్ను నమ్మి నాకు ఛాలెంజింగ్ రోల్ ఇచ్చి నా కెరీర్ కి గొప్ప పునాది వేసిన అజయ్ భూపతి గారికి నేను కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. నాకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా దర్శక నిర్మాతలు ఒకే రకమైన పాత్రలతో నా వద్దకు వస్తున్నారు. ‘నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కానీ నా వద్దకు వచ్చే కధలలో నుండి మంచి పాత్రలని సెలెక్ట్ చేసుకుని మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాను. గ్లామర్‌ పాత్రలు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ నేను హద్దులు దాటను. నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని నేను తప్పకుండా పాటిస్తాను.

నా కెరీర్ ఇప్పుడు ‌ ప్రారంభ దశలోనే ఉంది. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలనని నాకు నమ్మకముంది. చరిత్రలో నిలిచిపోయే మంచి పాత్రలు చేయాలని తన మనసులోని మాటలని బయట పెట్టింది ఈ హాట్ బ్యూటి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular