Manchu Vishnu Movie Update: పాపం మా అధ్యక్షుడు అయ్యాక, సినీ నటుడు మంచు విష్ణు టైం అస్సలు బాగాలేదు. అంతకు ముందు జగన్ తో మీటింగ్ విషయంలో పేర్ని నాని చేతిలో అవమాన పడ్డాడు. అలాగే గత వారం నుంచి హెయిర్ డ్రెసర్ నాగ శ్రీనుతో వివాదం నడుస్తోంది. అందుకే.. వీటన్నిటిని త్వరగా జనం మర్చిపోవాలని విష్ణు తన కొత్త సినిమాల విశేషాలను వరుసగా వదులుతున్నాడు.
కాగా మంచు విష్ణు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘గాలి నాగేశ్వరరావు’. టైటిల్ ను బట్టే ఈ సినిమా ఒక కామెడీ సినిమా అని అర్ధం అయిపోతుంది. కాగా విష్ణు లీడ్ రోల్ లో రాబోతున్న ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్ ఫుత్, రేణుక గా సన్నీలియోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

‘గాలి నాగేశ్వరరావు’ క్యారెక్టర్ ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే… పాయల్, సన్నీలియోన్ గెటప్ లను కూడా కార్టూన్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి విష్ణుకి హీరోయిన్స్ గా అదిరిపోయే బోల్డ్ భామలను తీసుకున్నారు. కాగా డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: Shruti Haasan: మనం మనతో నిజాయితీగా ఉండాలి – శృతి హాసన్
కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించాడట.
Also Read: Radhe Shyam Movie Review: ‘రాధేశ్యామ్’ రివ్యూ : సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే
[…] […]