Payal Ghosh: హీరో మంచు మనోజ్ ‘ప్రయాణం’సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ‘పాయల్ ఘోష్’ గుర్తుందా ? ప్రయాణం తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా సక్సెస్ లేక చివరకు ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకోండి, ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’లో తమన్నా స్నేహితురాలిగా ఒక సైడ్ క్యారెక్టర్ లో నటించింది.
అయితే, తాజాగా ఈ హాట్ బ్యూటీ పై గుర్తు తెలియని వ్యక్తులు తన పై యాసిడ్ దాడి చేసే ప్రయత్నం చేశారని పాయల్ ఘోష్ (Payal ghosh) చెప్పుకొచ్చింది. చేతికి గాయాలైన పిక్ ను కూడా తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆ పిక్ తో పాటు ఆమె ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.
పాయల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘చాలా రోజుల తర్వాత బయటకు వెళ్లి.. ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకొచ్చే వద్దామని వెళ్లాను. నా పనులన్నీ పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారని రాసుకొచ్చింది.
అయితే, ఆమె వారి నుంచి తప్పించుకున్నప్పటికీ ఆ సమయంలో తన చేతికి స్వల్ప గాయాలయ్యాయని, అయితే వాళ్ల చేతుల్లో యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే సాయం కోరుతూ గట్టిగా కేకలు వేశాను. దాంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సంఘటన తర్వాత ప్రతి క్షణం నాకు భయమేస్తోంది. దానిని తలుచుకుంటుంటే ఇప్పటికీ కంగారుగానే ఉంది’ అంటూ పాయల్ తెలియజేసింది.