https://oktelugu.com/

దర్శకుడి వికృత చేష్టల పై హీరోయిన్ ఫిర్యాదు !

మంచు మనోజ్ ‘ప్రయాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ‘పాయల్ ఘోష్’. ప్రయాణం తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా నటించి మొత్తానికి సైడ్ క్యారెక్టర్స్ కి కూడా తాను రెడీ అని చాటి చెప్పుకున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పాయల్ ఘోష్ పెద్దగా సాధించింది ఏమి లేదు. అయితే హీరోయిన్ గా, నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా.. ఈ భామ […]

Written By:
  • admin
  • , Updated On : September 20, 2020 / 11:57 AM IST
    Follow us on


    మంచు మనోజ్ ‘ప్రయాణం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ‘పాయల్ ఘోష్’. ప్రయాణం తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా నటించి మొత్తానికి సైడ్ క్యారెక్టర్స్ కి కూడా తాను రెడీ అని చాటి చెప్పుకున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పాయల్ ఘోష్ పెద్దగా సాధించింది ఏమి లేదు. అయితే హీరోయిన్ గా, నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా.. ఈ భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మధ్య మీరా చోప్రా – ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదంలో ఎన్టీఆర్ కి కి సపోర్ట్ గా మాట్లాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకట్టుకున్న ఈమె, అప్పటినుండీ టాలీవుడ్ గొప్పదనం, బాలీవుడ్ చీకటి కోణాలు గురించి చెబుతూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తోంది.

    Also Read: 70 కోట్లుకు తక్కువైతే సినిమా చేయడట !

    అయితే తాజాగా ఓ డైరెక్టర్ భాగోతాన్ని బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. తనను ఓ డైరెక్టర్ బాగా గారాబం చేసేవాడని, ఆ చనువుతో ఓ రోజు రూమ్‌కి పిలిచి బ్లూ ఫిల్మ్ చూపించాడంటూ ఆ మధ్య సంచలన ఆరోపణలు చేసిన పాయల్ ఘోస్ అప్పుడు ఆ డైరెక్టర్ పేరు చెప్పలేదు. అయితే తాజాగా పాయల్ ఘోష్.. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, అనురాగ్ కశ్యప్ అని బహిరంగంగా చెప్పి మొత్తానికి అనురాగ్ కశ్యప్ కి షాక్ ఇచ్చింది. పాయల్ ఇంకా అతని గురించి చెబుతూ.. అనురాగ్ కశ్యప్ రూమ్‌‌కి పిలిచి చేసిన వికృత చేష్టల గురించి ఎంత చెప్పినా తక్కువే. తనని అతని రూమ్‌లోకి తీసుకెళ్లి తన దుస్తులు విప్పేసి తనతో దారుణంగా ప్రవర్తించాడని, ఆ సందర్భం వర్ణించలేను అంటూ పాయల్ ఘోష్ తన గోడుని వెల్లడించింది.

    Also Read: బాలుగారి హెల్త్ అప్ డేట్ : కోలుకుంటున్నారు, కానీ.. !

    పైగా పాయల్ ఘోష్ ప్రధాని మోదీకి ట్వీట్ చేస్తూ.. ‘దయచేసి అతని ముసుగు వెనుక ఉన్న రాక్షసుడిని దేశానికి చూపించండి. ఇది నాకు హాని కలిగిస్తుందని నాకు తెలుసు, అలాగే నా భద్రతకు ప్రమాదమని తెలుసు. దయచేసి అతని పై వెంటనే చర్యలు తీసుకుని సాయం అందించండని మోదీని పాయల్ కోరుకుంటూ మోదీ కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. మొత్తానికి పాయల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. మరి అనురాగ్ కశ్యప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.