Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ ఆ పేరు వింటేనే తెలుగునాట ఒక వైబ్రేషన్.. ఆయన అభిమానులకు ఒక సెన్షేషన్. అలాంటి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు హిట్స్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే బోలెడంతా క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో పవన్ లాంటి దమ్మున్న హీరోకు దమ్మున్న సినిమా పడాలే కానీ టాలీవుడ్ రికార్డులు అన్నీ చెరిగిపోతాయి. ఘోరమైన ఫ్లాపుల తర్వాత కూడా 100 కోట్ల మార్కు దాటించగల సినిమాలను తీయగల నేర్పు పవన్ సొంతం. ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరీ..
రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ మూడేళ్లు గ్యాప్ తీసుకొని భారీగా పోరాడారు. కానీ రాజకీయం కలిసి రాలేదు. పార్టీని నడిపేందుకు.. తన కుటుంబ పోషణకు మళ్లీ సినిమాల్లోకి రాక తప్పలేదు. తాజాగా ‘వకీల్ సాబ్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాకు గాను ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం (Remuneration) తీసుకొని ఇండస్ట్రీలో తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు పవన్ ఇచ్చిన కాల్షీట్లు చాలా తక్కువ. ఓ వైపు రాజకీయం చేస్తూనే ఇటు సినిమాల్లో నటించాడు.అయినా కూడా నిర్మాత దిల్ రాజ్ ఏకంగా రూ.50 కోట్లు వకీల్ సాబ్ కోసం పవన్ కు ఇచ్చాడన్న టాక్ సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పుడు మైత్రీ మూవీస్ లో ఓ సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా కోసం పవన్ కు రూ.60 కోట్ల పారితోషికం ఇస్తున్నారట.. అంటే పవన్ పారితోషికాన్ని మైత్రీ మరో పది కోట్లకు పెంచినట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ‘వకీల్ సాబ్’ కంటే కూడా ఈ సినిమాకు పవన్ ఇంకొన్ని ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ మాత్రం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హరీష్ కు హుకూం జారీ చేశాడట.. ఎందుకంటే ఇప్పటికే పవన్ చేతిలో ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలున్నాయి. వాటిని పూర్తి చేశాక హరీష్ సినిమా మొదలుపెడుతాడు.
ఇక హరీష్ కూడా మేకింగ్ లో చాలా స్పీడు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయిపోయింది. పవన్ అండదండలుంటే ఈ సినిమాను చకచకా పూర్తి చేయడానికి రెడీ అయిపోయాడట.. సో ఇలా టాలీవుడ్ లోనే హిట్స్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఏకంగా 60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న హీరోగా పవన్ నిలిచాడనడంలో ఎలాంటి సందేహం లేదు.