Viral Photos: పవన్ కళ్యాణ్ సతీమణి అనా లెజినోవా భర్త అడుగుజాడల్లో నడుస్తుంది. ఆయన సేవా గుణాన్ని అలవరుచుకుంది. భర్తకు తగ్గ భార్య అనిపిస్తుంది. క్రిస్మస్ పండగ వేళ అనా అనాథ పిల్లలకు సహాయం చేశారు. వారితో కలిసి పండగ చేసుకున్నారు. హైదరాబాద్ లోని బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ది చిల్డ్రన్ అనాథ శరణాలయాన్ని అనా సందర్శించారు. వారితో కలిసి క్రిస్మస్ పండగ జరుపుకున్నారు.
క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనాథ శరణాలయానికి కావలసిన నిత్యావసర సరుకులు అందించారు. అనా రాకతో అనాథ పిల్లల్లో ఆనందం వెల్లి వెరిసింది. వారు ఎంతగానో సంతోషించారు. పవన్ కళ్యాణ్ గురించి పిల్లలు ఆమెను అడిగారు. జీవోదయ హోమ్ ఫర్ ది చిల్డ్రన్ నిర్వాహకులు అనాను సత్కరించారు.
అనా కు శాలువా కప్పి గౌరవించుకున్నారు. అనా చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అనా అనాథ శరణాలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ అనా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే… మా వదినది కూడా అన్నయ్య వలె మంచి మనసు అని కొనియాడుతున్నారు. అనా అనాథ శరణాలయాన్ని సందర్శించిన ఫోటోలు పై మీరు కూడా ఒక లుక్ వేయండి.
ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళతారు. అనా రష్యాకు చెందిన మహిళ కావడంతో అక్కడే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది రష్యా వెళ్లడం కుదర్లేదు. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పక్కన పెట్టి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఇండియాలోనే అనా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది…
#PawanKalyan‘s wife #AnnaLezhneva celebrated #Christmas with Orphanage kids. pic.twitter.com/d0EUjFGOIU
— BuzZ Basket (@theBuzZBasket) December 25, 2023