Pawan Kalyan Son First Film: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఆయనని ఆరాధ్య దైవంలా భావిస్తారు..ఆయన సినిమా వస్తుంది అంటే చాలు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరుకు థియేటర్స్ వైపు క్యూ కడుతారు..అలాంటి స్టార్ హీరో కొడుకు సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు..లేటెస్ట్ గా ఆయన తనయుడు అకిరా నందన్ ఫోటోలు మరియు బాక్సింగ్ వీడియోలు సోషల్ మీడియా లో చూస్తూ ఉంటె పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ కొత్తల్లో వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో అలా కనిపిస్తున్నాడు..లేటెస్ట్ గా ఆయన జిం లో చేసిన బాక్సింగ్ వీడియో మరియు కర్ర సాము వీడియోలు చూసి అభిమానులు తమ్ముడు సినిమాలోని పవన్ కళ్యాణ్ ని గుర్తుకు చేసుకున్నారు..ఇక సోషల్ మీడియా అభిమానులందరూ త్వరలో అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని..దానికోసమే ఇప్పటి నుండి కసరత్తులు చేస్తున్నాడు అని, ఇలా రకరకాల ఊహించుకుంటూ పోస్టులు పెట్టారు..అయితే వీటిని గమనించిన రేణు దేశాయ్ వెంటనే స్పందించి అకిరా నందన్ కి సినిమాల్లో నటించే ఆసక్తి లేదు అని..వాడికి మ్యూజిక్ మీద బాగా ఆసక్తి అంటూ చెప్పుకొచ్చింది.

కానీ అభిమానులు మాత్రం అంత పెద్ద స్టార్ హీరో కొడుకు సినిమాల్లోకి రాకుండా ఎలా ఉంటాడు, కేవలం పూర్తి వివరాలు అప్పుడే బయట పడకుండా ఉండేందుకే రేణు దేశాయ్ అలా చెప్పి ఉంటుంది అని అనుకుంటున్నారు..పవన్ కళ్యాణ్ కి కూడా మొదట్లో సినిమాల మీద అసలు ఆసక్తి ఉండేది కాదు అని, మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ గారి ప్రోత్సహం తోనే ఆయన ఇండస్ట్రీ లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని ,అలా వచ్చిన అవకాశం ని పూర్తిగా వినియోగించుకొని నేడు ఆయన ఇండస్ట్రీ లోనే నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు అని, అకిరా కూడా తండ్రి బాటలోనే పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా పోస్టులు పెడుతున్నారు.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్టోరీ ఇదేనా.. బయపడిపోతున్న మహేష్ ఫాన్స్
అయితే అభిమానుల అంచనా తప్పు అవ్వలేదు అనే చెప్పాలి..అకిరా నందన్ మొదటి సినిమాకి సంబంధించిన పనులు ఇప్పటి నుండే సైలెంట్ గా ప్రారంభం అయిపోయాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తాడు అని తెలుస్తుంది..గతం లో కూడా పలు సందర్బాలలో రామ్ చరణ్ నా తమ్ముడు సినిమాని నా ప్రొడక్షన్ లో లాంచ్ చేస్తే అంత కన్నా అదృష్టమా అంటూ చెప్పుకొచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక అకిరా నందన్ మొదటి సినిమాకి పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడు అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారు అని తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ కి ఆయన గతం లో జల్సా , అత్తారింటికి దారేది వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..మల్లి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా మాత్రం అభిమానులను నిరాశ పరిచింది..కానీ ఇటీవల విడుదల అయినా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు..ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్ సినిమా సెలెక్షన్స్ అన్ని త్రివిక్రమ్ గారే దగ్గర ఉంది మరి చూసుకుంటున్నాడు..తమ అభిమాన హీరో పట్ల ఇంత శ్రద్ద చూపించే త్రివిక్రమ్, అకిరా నందన్ మొదటి సినిమా కి కూడా దానికి మించిన శ్రద్ద చూపిస్తాడు అని అభిమానులు కోరుకుంటున్నారు..మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ అంచనాలను అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Also Read:Bigg Boss Telugu Non Stop OTT: బిగ్ బాస్ లోకి మరో వైల్డ్ కార్డ్.. హౌస్ లోకి బెస్ట్ ఎంటర్ టైనర్
[…] Bigg Boss Telugu OTT: బిగ్ బాస్‌లో చాలా ట్విస్టులతో కూడిన టాస్క్‌లను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడూ ఎమోషనల్ అయితే ఏం బాగుంటుందని.. బోల్డ్ కంటెంట్‌కు పెద్ద పీట వేస్తున్నాడు బిగ్ బాస్. పైగా గొడవలు ఏ మాత్రం తక్కువగా ఉండకుండా చూసుకుంటున్నాడు. ఇకపోతే హౌస్‌లో నటరాజ్ మాస్టర్ ఎంతలా ఫైర్ చూపిస్తున్నాడో మనం చూశాం. […]
[…] Chiranjeevi Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన ఎందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కావడం తో మెగా అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది..ఈ సినిమాలో చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఒక్క మాస్ సాంగ్ కి డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..తండ్రి కొడుకులు ఇద్దరినీ ఒక్కే సాంగ్ లో డాన్స్ చెయ్యడం చూసే అభిమానులకు థియేటర్ లో అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ అంటున్నాడు..ఈ పాట ఈనెల 20 వ తారీఖున యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది.. గతం లో రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ లో ఒక్క చిన్న బిట్ కి డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిన్న బిట్ కి అప్పట్లో అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు..ఇప్పుడు ఏకంగా ఇద్దరు కలిసి వెండితెర మీద 45 నిమిషాల పాటు కనిపించబోతుండడం తో ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. […]