Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. బాధలో టాలెంటెడ్ డైరెక్టర్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. బాధలో టాలెంటెడ్ డైరెక్టర్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథతో చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ చిత్రం విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమాని ఓటీటీ బరిలోకి దించమని పవన్ చెబుతున్నాడట.

Pawan Kalyan
Pawan Kalyan

పవన్ ఇలా చెప్పాడని ఇండస్ట్రీలో ఇదే బలమైన టాక్ వినిపిస్తోంది. దర్శకుడు క్రిష్, ఎందుకో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకోలేకపోతున్నాడు. త్రివిక్రమ్ సూపర్ విజన్ కూడా ఈ సినిమాకి కావాల్సి వచ్చింది. కానీ, కథ పై ఎన్ని కసరత్తులు చేసినా.. ఇప్పటివరకు షూట్ చేసిన పార్ట్ పవన్ కి నచ్చలేదు.

Also Read: Producers Worried About Extra Cost: హీరోల అదనపు ఖర్చులకు నిర్మాతలు గగ్గోలు

అందుకే, ఈ భారీ సినిమాకి సరైన బేరం వస్తే ఓటీటీకి ఇవ్వండి అంటూ పవన్ కామెంట్స్ చేశాడట. నిజానికి క్రిస్ ఒక చిన్న థ్రెడ్ తీసుకుని, దానికి పక్కా కమర్షియల్ హంగులు అద్ది తీస్తున్న సినిమా ఇది. ఇదే విషయం క్రిష్ ఎన్నిసార్లు చెప్పినా.. పవన్ నమ్మడం లేదు. కారణం.. సినిమాలో ఎక్కడా కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు.

Pawan Kalyan
Pawan Kalyan

పైగా ఈ హరి హర వీర మల్లు పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇప్పటికే 70 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ ఇది. ప‌వ‌న్ ది రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో నటిస్తున్నాడు. నిజానికి తన పార్ట్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి అయిన సీన్స్ ను పవన్ ఆల్ రెడీ చూసాడు. పవన్ కి క్రిష్ డైరెక్షన్ అస్సలు నచ్చలేదు.

పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు. ఈ గెటప్స్ కూడా సరిగ్గా సెట్ కాలేదు అట. అందుకే.. పవన్ చిరాకుతో ఉన్నాడని టాక్.

Also Read:Thank You Movie Review: రివ్యూ : “థాంక్యూ”
Recommended Videos
పవర్ స్టార్ ని మించిన హీరో ఇండస్ట్రీ లో లేడు  || Bheemla Nayak Set All Time Record || Pawan Kalyan
మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నఅనుష్క || Anushka Setty Marriage News Goes Viral || Prabhas
ఆ హీరో కోసం కెరీర్ ని నాశనం చేసుకున్న రకుల్ || Rakul Preet Singh || Akkineni Nagarjuna

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version