Pawan Kalyan- Venkatesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేరీర్ లో ప్రతి సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అవుతాయి..ఒక మాములు సినిమాకి కూడా విపరీతమైన హైప్ ని తెప్పించే సత్తా ఒక పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది..అలాంటిది ఆయన కెరీర్ లో టీజర్ దగ్గర నుండి ట్రైలర్ , పాటలు వరుకు ప్రతి ఒక్కటి అభిమానులకు పూనకాలు రప్పించేలా చేసిన సినిమా ‘పంజా’..పవన్ కళ్యాణ్ కెరీర్ లో హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి తమిళ టాప్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించగా, బాహుబలి వంటి దేశం గర్వించదగే సినిమాని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ ఈ సినిమాని నిర్మించారు..అప్పట్లో ఈ సినిమా టీజర్ మరియు టైటిల్ సాంగ్ ఒక ప్రభంజనం..పవన్ కళ్యాణ్ లుక్ కూడా అభిమానులకు పిచ్చెక్కిపోయేలా చేసింది..ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపొయ్యే చిత్రం ఈ సినిమా నిలుస్తుంది అని అనుకుంటే..కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ సినిమా గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ లుక్స్ మరియు నటన అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కథ కథనం వీక్ గా ఉండడం తో ఈ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం అని అంటూ ఉంటారు టాలీవుడ్ విశ్లేషకులు..కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఇప్పటికి ఎంతో ప్రత్యేకమే..అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ మారింది..అదేమిటి అంటే ఈ సినిమాకి మొదట ‘ది షాడో’ అనే టైటిల్ ని పెడుదాం అనుకున్నారట..అప్పట్లో ఈ సినిమాకి ఉన్న వర్కింగ్ టైటిల్ ఇదే..కానీ పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ సినిమా టైటిల్ ని మార్చి ‘పంజా’ అని పెట్టారట..ఇక ఆ తర్వాత ఇదే టైటిల్ తో విక్టరీ వెంకటేష్ ‘షాడో’ అనే సినిమా తీసాడు.

ఇది కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఇక పంజా సినిమా అప్పట్లో ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది..కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఈ సినిమా అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్ టైం టాప్ 2 రికార్డు గా నిలవగా, ఓవర్సీస్ లో మాత్రం ఆల్ టైం రికార్డు గా నిలిచింది.