Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)చాలా తక్కువ రోజుల్లోనే సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకొని పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే 1997 వ సంవత్సరంలో ఆయన ఒక వ్యాపారవేత్త కూతురు అయిన నందిని ని పెళ్లి చేసుకున్నాడు. ఒక రెండు సంవత్సరాల పాటు కలిసి మెలిసి ఉన్నవాళ్లు ఆ తర్వాత వచ్చిన ఇబ్బందులతో ఎవరికివారు విడిపోయారు. 2008వ సంవత్సరంలో కోర్టు నుంచి అఫీషియల్ గా డైవర్స్ తీసుకున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం గా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తద్వారా ఆయన అనేక ప్రాంతాలను తిరుగుతూ అక్కడున్న ప్రజలను కలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని వాళ్లకు సొల్యూషన్స్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మొదటి భార్య అయిన నందిని(Nandini) ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు. ఏం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి నందినిగా ఉన్న తన పేరును జాహ్నవి(jahnavi) గా మార్చుకొని ప్రస్తుతం ఆమె యూఎస్ఏ లో ఒక ఎన్నారై ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు…
ఇక కొంతమంది రీసెంట్ గా ఆమె పవన్ కళ్యాణ్ ని కలిశారని తనకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే పవన్ కళ్యాణ్ క్లియర్ చేశాడంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కానీ వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎవరిని కలిసిన దాఖలాలు లేవు అంటూ తన సన్నిహితులు సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం డివోర్స్ తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక బ్యాడ్ ఫేజ్ అనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన దేనిని పట్టించుకోకుండా కేవలం రాజకీయాల మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ సెట్స్ మీద ఉంచిన సినిమాలను కూడా ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందు అడుగులు వేస్తున్నారు. మరి తనకున్నట్టుగానే ఈ సినిమాలను కంప్లీట్ చేసి తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…