Pawan Kalyan Instagram: ఇటీవల పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. గతంలో ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ ఇంస్టాగ్రామ్ లేదు. రాజకీయంగా దూసుకెళుతున్న పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలు, ఆలోచనలు అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలో లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇక ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్ దాటేసింది.
కాగా పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ చేశారు. అందులో ఆయన ఎమోషనల్ కామెంట్ పోస్ట్ చేశారు. అలాగే అద్భుతమైన వీడియో అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చారు. ‘మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ… అని కామెంట్ చేశారు. ఇక వీడియోలో పవన్ కళ్యాణ్ తన సినిమా జర్నీని ఆవిష్కరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో అనుబంధం గుర్తు చేసుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడియన్స్ తో దిగిన ఫోటోలు వీడియోలో జోడించారు. తన ప్రయాణంలో, విజయంలో వీరందరి పాత్ర ఉందని చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోని జనసైనికులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అద్భుతం అంటున్నారు. ఎప్పుడూ మీ వెంటే అని హామీ ఇస్తున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ పూర్తి స్థాయి రోల్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ ది ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్ లా ఉంటుందని సమాచారం. బ్రో సినిమాపై పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి ఉంది. బ్రో చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కింది. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram