Harish Shankar
Harish Shankar : టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు హరీష్ శంకర్(Harish Shankar). ‘షాక్’ సినిమాతో మొట్టమొదటిసారి మెగా ఫోన్ పట్టిన హరీష్ శంకర్, ఆ తర్వాత ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘గద్దల కొండ గణేష్’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని మళ్ళీ నెంబర్ 1 హీరో రేస్ లోకి నిలబెట్టిన చిత్రమిది. ఇప్పటికీ ‘గబ్బర్ సింగ్’ పేరు తీస్తే అభిమానులు పులకరించిపోతారు. ఆ సినిమా మిగిల్చిన మధురమైన జ్ఞాపకాలు అలాంటివి మరి. ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అనే ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో సంబరాలు చేసుకున్నారు.
ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. కానీ హరీష్ శంకర్ రాసిన స్టోరీ పవన్ కళ్యాణ్ కి ఏ మాత్రం నచ్చలేదు. తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరి’ మూవీ స్టోరీ లైన్ ని తీసుకొని స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని ఆదేశించగా, హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagath Singh) చిత్రాన్ని ప్రకటించాడు. షూటింగ్ మొదలెట్టి 30 శాతం పూర్తి చేసి రెండు గ్లిమ్స్ వీడియోలు కూడా వదిలారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే హరీష్ శంకర్ ఆలోచనలు ఇప్పుడు బాగా అవుట్ డేటెడ్ అయ్యాయి అనేది అందరి అభిప్రాయం. అందుకు ఉదాహరణగా ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం నిల్చింది. రవితేజ కి ‘మిరపకాయ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన హరీష్ శంకర్, ‘మిస్టర్ బచ్చన్’ లాంటి డిజాస్టర్ ని కూడా అందించాడు. ఇలాంటి పాత ముతక ఐడియాలతోనే హరీష్ శంకర్ ఉన్నాడు, ఈ బుర్రతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తీస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో డిజాస్టర్ అవుతుందేమో అని అభిమానులు భయపడ్డారు.
అయితే ఫ్లాప్ నుండి హరీష్ శంకర్ తన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటాడని అందరూ భావించారు. కానీ నిన్న ఆయన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు చూస్తే ఈయన ఇంకా ఏమి మారలేదని అనిపిస్తుంది. చిరు లీక్స్ లాగా హరీష్ లీక్స్ అందిస్తున్నాను, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం లో పవన్ కళ్యాణ్ కార్ రూఫ్ మీద కూర్చొని వెళ్లే సన్నివేశం ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. 2022 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ తనని ఇప్పటం గ్రామానికి వెళ్తున్న సమయంలో అడ్డుకున్నందుకు గాను, వాళ్లకు నిరసనగా కార్ రూఫ్ మీద కూర్చొని జాతీయ రహదారి మీద వెళ్లే సంఘటన మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సంఘటనని ఉస్తాద్ భగత్ సింగ్ లో రీ క్రియేట్ చేసాడట. దీనిపై సోషల్ మీడియా లో అభిమానుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ గత దశాబ్దం లో వర్క్ అవుట్ అవుతాయి, నువ్వు దశాబ్ద కాలం దగ్గరే ఆగిపోయావు, దయచేసి అప్డేట్ అవ్వు, ఇలాంటి సన్నివేశాలు అభిమానులు తప్ప, ప్రేక్షకులు స్వాగతించరు అంటూ హరీష్ పై అభిమానులు మండిపడ్డారు.