Badri' Re-Release
Badri’ Re-Release : గత ఏడాది వరకు మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత మంది హీరోల రీ రిలీజ్ సినిమాలు విడుదలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ ఏ హీరోకి కూడా రాలేదని చెప్పొచ్చు. గత ఏడాది ‘మురారి’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలు రీ రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. మురారి అంటే పాత సినిమా కాబట్టి, వింటేజ్ మూవీ కాబట్టి ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరించారు. కానీ ‘గబ్బర్ సింగ్’ చిత్రం వింటేజ్ మూవీ కాదు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల సినిమా. ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు కానీ, మొదటి రోజే 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం సెన్సేషనల్ రికార్డు ని నెలకొల్పింది. మురారి చిత్రానికి 3 రోజులకు కలిపి వచ్చిన వసూళ్లను ఈ చిత్రం కేవలం మొదటి రోజే రాబట్టింది.
ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ, ఒక్కటి కూడా దరిదాపుల్లోకి వెళ్లలేకపోయాయి. రీ రిలీజ్ చిత్రాల్లో రికార్డ్స్ కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాల మధ్య మాత్రమే ఉంది. అయితే ‘గబ్బర్ సింగ్’ రికార్డుని బద్దలు కొట్టడానికి పవన్ కళ్యాణ్ సినిమానే సిద్ధం అవుతుంది. ఆయన కెరీర్ ప్రారంభం లో చేసిన చిత్రాలలో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘బద్రి’. పూరి జగన్నాథ్ కి ఈ సినిమా మొట్టమొదటి చిత్రం అనొచ్చు. ఈ చిత్రం లో హీరోయిజం అప్పటి ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపించింది. పవన్ కళ్యాణ్ ఊర మాస్ యాటిట్యూడ్ ని చూపించిన చిత్రమిది. ఈ సినిమాని 4K లోకి మార్చి రీ రిలీజ్ చేయడానికి చాలా కాలం నుండి అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ఈ సినిమా నిర్మాత స్వర్గుస్తులై చాలా కాలమైంది. రీ రిలీజ్ రైట్స్ ఎవరి దగ్గర తీసుకోవాలో తెలియలేదు. చివరికి నిర్మాత కుమారుడుని పట్టుకొని అభిమానులు ఎట్టకేలకు రీ రిలీజ్ చేసుకునే రైట్స్ ని కొనుగోలు చేసారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ‘గబ్బర్ సింగ్’ కి బదులు ఈ సినిమానే విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా రైట్స్ మా దగ్గర కూడా ఉన్నాయంటూ మరికొంత మంది బయ్యర్లు కోర్టు లో కేసు వేశారు. ఇన్ని రోజులు కోర్టులో ఈ చిత్రం పై కేసు నడవడం వల్ల రీ రిలీజ్ కి నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు కోర్టు చిక్కులు వీడిపోయి ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం గా ఉంది. వాలెంటైన్స్ డే రోజున విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, అది సాధ్యం అయ్యేలా లేదు. మార్చి నెలలో ఒకవేళ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుంటే, ఈ సినిమాని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.