
Preeti Jingania : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి రాగానే వరుస హిట్లతో అదరగొట్టారు. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్ నిలిచిన మూవీస్ ల్లో ‘తమ్ముడు’ ఒకటి. ఈ సినిమాలో పవన్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ పిదా అయ్యారు. స్టోరీ హైలెట్ కావడంతో పాటు రమణ గోకుల అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. ఇక ఇందులో పవన్ సరసన అమాయకంగా.. అచ్చమైన తెలుగు అమ్మాయిలా నటించిన హీరోయిన్ ప్రీతి జింగానియా అని అందరికీ తెలిసిందే. డెబ్యూ సినిమాతోనే హిట్టు అందుకున్న ఈ ముద్దుగుమ్మ మలయాళం నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. ఆ తరువాత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ మిగతా భామల వలె స్టార్ ఇమేజ్ రాకపోయేసరికి ఫ్యామిలీ లైఫ్ కే పరిమితమయ్యారు. ఇన్నాళ్ల తరువాత ఆమెకు సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూడండి..
ప్రీతి జింగానియా చదువంతా ముంబైలోని జీడీ సోమాని మెమోరియల్ స్కూల్లో సాగింది. 1997లో రాజశ్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ ఆల్బమ్ ‘యే హై ప్రేమ్’ లో కనిపించింది. ఆ తరువాత 1999లో ‘మజవిల్లు’ అనే మలయాళ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత తమిళం ‘హలో’ సినిమాలో నటించింది. ఈమె తన నటనతో ఆకట్టుకోవడంతో ‘తమ్ముడు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు నటించిన సినిమాల్లో రాని గుర్తింపు ప్రీతి జింగానియాకు ‘తమ్ముడు’తో రావడంతో ఆమె తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నరసింహానాయుడు’, మోహన్ బాబుతో ‘అధిపతి’లో నటించింది. ఆమె చివరిసారిగా ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ లో కనిపించింది.

పలు కారణాల వల్ల సినిమాల నుంచి తప్పుకున్న ఆమె 2008లో పెళ్లి చేసుకుంది. అంతకుముందు చిత్ర నిర్మాత ఫిరోజ్ నడియద్వాలా సోదరుడు ముస్తాక్ ఖాన్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ వీరి వివాహం రద్దయింది. ఆ తరువాత నటుడు, దర్శకుడు పర్విన్ దబాస్ ను వివాహం చేసుకున్నారు. వీరికి జైవీర్, దేవ్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి దూరమై కుటుంబానికే పరిమితం అయిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది.
ఇటీవల ఆమెకు సంబంధించిన లెటేస్ట్ పిక్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదరని అందం నీది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమాల్లో నటించినంత కాలం ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుుడు మళ్లీ సినిమాల్లో నటించాలని కొందరు కోరుతున్నారు. మిగతా హీరోయిన్ల లాగా ప్రీతి జింగానియా సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాట్ చేయాలంటున్నారు. మరి ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూద్దాం..