https://oktelugu.com/

Pawan Kalyan`s BRO : సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్న పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ సరికొత్త పోస్టర్

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లుంగీ గెటప్ లో కనిపిస్తూ స్టైల్ గా నిల్చున్న ఫోజు అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ ని చూడగానే అభిమానులు ఒక్కసారిగా తమ్ముడు చిత్రం రోజులకు వెళ్లిపోయారు.

Written By: , Updated On : June 27, 2023 / 10:24 AM IST
pawan kalyans bro

pawan kalyans bro

Follow us on

Pawan Kalyan`s BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ‘బ్రో ది అవతార్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ప్రొమోషన్స్ ఇంకా ప్రారంభించలేదని, టీజర్ ఇంకా విడుదల కాలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని సోషల్ మీడియా లో తిడుతూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అప్డేట్ ని మరి కాసేపట్లో ఇవ్వబోతుంది మూవీ టీం. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సముద్ర ఖని కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ని విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లుంగీ గెటప్ లో కనిపిస్తూ స్టైల్ గా నిల్చున్న ఫోజు అభిమానులకు మెంటలెక్కిపోయేలా చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ ని చూడగానే అభిమానులు ఒక్కసారిగా తమ్ముడు చిత్రం రోజులకు వెళ్లిపోయారు. ఆ సినిమాలో ‘వయ్యారి భామ నీ హంస నడక’ అనే పాట అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.

ఆ సాంగ్ లో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉందో, ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో కూడా అలాగే ఉంది. ఇక టీజర్ కట్ కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసే విధంగా ఉంటుందట. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాకి హైప్ లేదు అని బాధ పడుతున్నారు, టీజర్ విడుదలైన తర్వాత ఈ చిత్రానికి వచ్చే హైప్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు, చూడాలి మరి.