Pawan Kalyan-Karthi : తిరుపతి లడ్డు వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. వైసీపీ హయాం లో లడ్డులు అపవిత్రం అయ్యినందున పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ‘ప్రాయశ్చిత్త దీక్ష’ ని చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ గుడి వద్ద శుద్ధి కార్యక్రమం ని తలపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈ ఘటన ని సీరియస్ గా తీసుకోకుండా కామెడీ గా మాట్లాడిన వారిపై మండిపడ్డాడు. ముఖ్యంగా నిన్న జరిగిన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ లడ్డు విషయం లో కామెడీ చేయడం పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు.
దీనికి కార్తీ వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పాడు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కార్తీ క్షమాపణలు స్వీకరించి, తిరుపతి లడ్డు విషయం ఎంత సున్నితమైన అంశమో వివరించి, ఆయన నటించిన ‘సత్యం సుందరం’ చిత్రం సక్సెస్ అవ్వాలని శుభాకంక్షాలు తెలియచేసాడు. ఇదంతా పక్కన పెడితే కార్తీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదే, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు అని అభిమానులు సైతం ఫీల్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ ఇలా స్పందించడమే కరెక్ట్. వాస్తవానికి కార్తీ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ లడ్డు మీమ్ పై ఆయన స్పందించకుండా, ప్రస్తుతం సెన్సేషనల్ టాపిక్ గా మారిన తిరుపతి లడ్డు ని లింక్ చేయడం పొరపాటే. దీనిని పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఖండించకపోతే భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన హీరోలు, డైరెక్టర్లు ఎదో తిరుపతి లడ్డు మ్యాటర్ ని కామెడీ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద చర్చ దీని గురించి నడిచింది కాబట్టి ఇక మీదట ఎవరైనా ఈ ఘటన పై కామెడీ చేయాలంటే భయపడతారు. అసలు హిందూ సంప్రదాయాల మీద ఎంతో మంది అవహేళన చేస్తూ కామెడీ చేయడం వంటివి మనం ఎన్నో చూసాము. ముఖ్యంగా బాలీవుడ్ లో అనేక సినిమాలు కూడా తెరకెక్కాయి.
ఆ సంస్కృతి మన టాలీవుడ్ కి అలవాటు కాకముందే ఇలా రెస్పాన్స్ ఇవ్వడం మంచిదే. ఎవరికైనా నిజంగా తన మతం పై ఎనలేని ప్రేమ, గౌరవం ఉంటే ఇలాగే స్పందిస్తారు. అయితే కార్తీ క్షమాపణలు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ దానికి స్పందించి మాట్లాడితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన కాసేపటి క్రితమే కార్తీ వెంటనే స్పందించిన తీరుని మెచ్చుకుంటూ ఒక ట్వీట్ వేసాడు. దీంతో ఈ సమస్య ఇక్కడితో సర్దుమణిగింది. ఇది ఇలా ఉండగా కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన ‘సత్యం సుందరం’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More