https://oktelugu.com/

Mahesh Babu : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్‌కు అన్నగా, తండ్రిగా ముందుగా ఏ స్టార్ లను అనుకున్నారో తెలుసా..?

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వరుసగా హిట్లు కొడుతూ మంచి విజయాలను అందుకున్నారు. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రం రాలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2023 / 08:53 PM IST

    Seethamma Vakitlo Sirimalle Chettu,

    Follow us on

    Mahesh Babu : తెలుగు సినిమా ల్లో హీరోలకి ఉన్న ఇమేజ్ వేరే ఏ ఇండస్ట్రీ హీరోలకు ఉండదు అని అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ప్రేమిస్తే ప్రాణం పోయేవరకు ప్రేమిస్తారు, అలాగే ఒకరి మీద అభిమానం పెంచుకుంటే వాళ్ళు బతికి ఉన్నంత వరకు వాళ్లని అలాగే అభిమానిస్తారు అలాంటి ఈ ఇండస్ట్రీ లో హీరోలు గా పుట్టడం నిజంగా వాళ్ళు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి…

    అయితే అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వరుసగా హిట్లు కొడుతూ మంచి విజయాలను అందుకున్నారు. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రం రాలేదు. ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చాలా వచ్చేవి కృష్ణ, శోభన్ బాబు కలిసి చాలా సినిమాల్లో నటించారు.అలాగే ఎన్టీయార్, నాగేశ్వరరావు కలిసి కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు కానీ వాళ్ల తర్వాత జనరేషన్ లో మాత్రం మల్టీస్టారర్ సినిమాలు రాలేదు దాంతో ఒక సినిమాలో ఇద్దరు హీరోలని చూడాలి అనే ప్రేక్షకుడి కోరిక అలాగే మిగిలిపోయింది. కానీ కొద్దిరోజులకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మాత్రం వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు కూడా మల్టీ స్టారర్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కంటే ముందు ఆయన పాత్ర కోసం టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించినట్లు గా తెలుస్తుంది ఈయన ని కలిసి డైరెక్టర్ కథ చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ కి చేయాలని ఉన్న కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో వెంకటేష్ చేసిన క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ ని సంప్రదించడం ఇక్కడ గమనార్హం…

    ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరు కలిసి నటిస్తే అది కంప్లీట్ మల్టీ స్టారర్ సినిమా అయ్యేది. ఎందుకంటే ఇద్దరు ఒకే జనరేషన్ హీరోలు కాబట్టి వాళ్ళు చేస్తే అది పూర్తిగా మల్టీ స్టారర్ సినిమా అయ్యేది ఇక వెంకటేష్, మహేష్ బాబు కలిసి చేశారు కాబట్టి వాళ్లిద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఉండటం తో అది కంప్లీట్ మల్టీ స్టారర్ గా గుర్తింపు పొందలేకపోయింది… నిజానికి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య కాంబో సెట్ అయితే అప్పట్లో అదో పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమా అయ్యేది అనే చెప్పాలి…ఇక డైరెక్టర్ వీళ్ల ఇద్దరికీ నాన్న గా అంటే ప్రకాష్ రాజ్ చేసిన పాత్ర కోసం కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ ని అడిగినట్లు గా ఆయనకి కథ కూడా చెప్పినట్టు గా ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ అడ్డాల చెప్పడం జరిగింది. కానీ రజినీకాంత్ ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది…

    ఇలా ఒకే సినిమా లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రజినీకాంత్ లాంటి ముగ్గురు స్టార్లు కలిసి నటిస్తే ఆ సినిమా అసలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదో మన ఊహాలకి కూడా అందడం లేదు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది…