Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రస్తుతం తమ అభిమాన హీరో తదుపరి చిత్రం ఏమిటి అనేది తెలియక తీవ్రమైన గందరగోళం లో ఉన్నారనే చెప్పాలి..వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తో ‘హరి హర వీర మల్లు’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ షూటింగ్ ని తిరిగి ప్రారంభం చేసుకున్న ఈ సినిమా రెండు కీలకమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది..అంతే ఇక ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా రెండు నెలల నుండి ఆగిపోయింది..ఇప్పుడు ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందా అనేది ఎవరికీ తెలియని పరిస్థితి..ఈ షూటింగ్ ఇంకా 40 శాతం బాలన్స్ ఉంది..ఇంతలోపే పవన్ కళ్యాణ్ తన హరిహరవీరమల్లు లుక్స్ నుండి బయటకి వచ్చి సరికొత్త లుక్స్ తో అందరిని షాక్ కి గురి చేసాడు..తమిళం లో సూపర్ హిట్ అయినా వినోదయ్యా సీతం రీమేక్ లో నటించేందుకే పవన్ కళ్యాణ్ లుక్ మార్చాడని..ఈ సినిమా షూటింగ్ కి ఆయన 20 రోజులు డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది..ఈ షూటింగ్ కూడా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనేది తెలియని పరిస్థితి.

మరో వైపు ముందస్తు ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే అవకాశాలు కనిపించడం తో అక్టోబర్ 5 వ తారీకు నుండి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంబించనున్నాడు..దీనితో పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు చేస్తాడా..లేదా వినోదయ్యా సీతం రీమేక్ చేస్తాడా అనే సందిగ్ధం లో పడ్డారు ఫాన్స్..ఈ రెండు సినిమాలు పూర్తి చెయ్యడానికే నానా తంటాలు పడుతుంటే ఇప్పుడు లేటెస్ట్ గా భవదీయుడు భగత్ సింగ్ ఒకటి పవన్ కళ్యాణ్ కి పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read: Prashanth Neel- NTR: ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు రప్పించే వార్త చెప్పిన ప్రశాంత్ నీల్

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోయ్యే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది..ఆ సంస్థ అధినేత నవీన్ గారు పవన్ కళ్యాణ్ కి 7 ఏళ్ళ క్రితమే 40 కోట్ల రూపాయిలు పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ గా ఇచ్చారు..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి డేట్స్ ఎంతకు సర్దుబాటు చెయ్యలేకపోతుండడం తో ‘ఒకవేళ సినిమా వద్దు అనుకుంటే మేము ఇచ్చిన అడ్వాన్స్ కి వడ్డీ కలిపి 50 కోట్లు తిరిగి ఇవ్వాలి’ అని నవీన్ గారు అడుగుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..మరి పవన్ కళ్యాణ్ తన డేట్స్ ని సర్దుబాటు చేస్తూ ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు ఎలా బాలన్స్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
[…] Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల రూపాయిలు … […]