Pawan Kalyan: నిన్న మొన్నటి వరకు సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గా మళ్లీ రాజకీయం గా ఫుల్ బిజీ అయిపోయాడు. నిన్ననే ఆయన ఎర్ర చందనం డిపో ని సందర్శించి, అక్కడి ప్రక్రియ మొత్తం అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ఇక నుండి స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను ముట్టుకోవాలన్నా భయపడేలా చేస్తామని పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక నేడు కుంకీ ఏనుగుల ట్రైనింగ్ ని సందర్శించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత తాడేపల్లి లోని నూలకపేట పోలీస్ స్టేషన్ ని సందర్శించాడు. అక్కడ పోలీసులతో కాసేపు చర్చలు జరిపి, స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్న విధానం ని దగ్గరుండి పరిశీలించి,అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లి గన్ ఫైరింగ్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ని పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాసేపటి క్రితమే తాడేపల్లి లోని నూలకపేట లో పోలీస్ ఫైరింగ్ ప్రాక్టీస్ ని దగ్గరుండి సందర్శించాను. పోలీసుల నుండి ఫైరింగ్ ప్రక్రియలను, ఫైర్ యార్మ్ హ్యాండ్లింగ్ ని అడిగి తెలుసుకున్నాను. గతం లో నేను చెన్నై లో ఉన్నప్పుడు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లో మెంబెర్ గా ఉండేవాడిని. చాలా రోజుల తర్వాత గన్ ఫైరింగ్ అనుభూతి చాలా బాగా అనిపించింది. చెన్నై లో మద్రాస్ రిఫైల్ క్లబ్ లో నేను చేసిన ప్రాక్టీస్ మరోసారి గుర్తుకొచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కి నిమిషాల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి గన్ ఫాంటసీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ మూవీ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ‘విలన్ ఒక గన్ కంపెనీ కి ఓనర్. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఇష్టమొచ్చినట్టు కాల్చేసుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడు’ అని అంటాడు గుర్తుందా?, నేడు పవన్ కళ్యాణ్ గన్ కాల్చే విధానం చూసి పూరి మాటలు గుర్తొచ్చాయి. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం లో గ్యాంగ్ స్టర్ గా కనిపించడం, ఇష్టమొచ్చినట్టు గన్స్ తో విలన్స్ ని కాల్చడం చూసిన ఫ్యాన్స్ కి, ఇలా నిజ జీవితంలో కూడా గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించడం అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చింది అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.