Unstoppable with NBK: ఈ ఏడాది ప్రారంభం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఆహ ఛానల్ లో ప్రసారం అయ్యి ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలతో బాలయ్య బాబు సరదాగా చేసిన చిట్ చాట్ అదిరిపోయింది..బాలయ్య బాబు లో ఈ కోణం కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ టాక్ షో..ఒక్క మాట లో చెప్పాలంటే ఆహా మీడియా OTT సంస్థ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది ఈ షో..అలాంటి షో కి రెండవ సీసన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్..అదేమిటి అంటే అన్ స్టాపబుల్ విత్ NBK రెండవ సీసన్ ఈ నెల 26 వ తారీకు నుండి ఆహా మీడియా లో ప్రసారం కాబోతుంది అట..దీనికి సంబంధించిన ప్రోమో మరియు ప్రారంభోత్సవ ఈవెంట్ అతి త్వరలోనే రానున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈసారి మొదటి ఎపిసోడ్ కి ఎవరు హాజరు కాబోతున్నారు అనేది సోషల్ మీడియా లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ..గత సీసన్ లో మొదటి ఎపిసోడ్ కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యాడు..కానీ ఈసారి ఇంకా భారీ గా ప్లాన్ చేసాడట అల్లు అరవింద్..మొదటి ఎపిసోడ్ కి గాను ఆయన పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ని ఆహ్వానించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపించినట్టు సమాచారం..పవన్ కళ్యాణ్ ఇది వరుకు ఎప్పుడు కూడా ఇలాంటి టాక్ షోస్ లో పాల్గొనలేదు..ఆయన తన సినిమాలకు కూడా ఇంటర్వూస్ ఇవ్వడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము..కానీ మొదటిసారి ఆయన ఇలాంటి టాక్ షో లో పాల్గొనబోతున్నారు అని వార్తలు రావడం పెద్ద ప్రాధాన్యత ని సంతరించుకుంది..పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ ని కూడా ఇది వరుకు మనం ఎక్కువ సందర్భాలలో బయట కలిసి ఉండడం చూడలేదు..ఇదే బాలయ్య బాబు తో ఆయన మొదటి లాంగ్ కన్వర్జేషన్..అభిమానులకు కనుల పండగే ఇది..గత సీసన్ లో ఆఖరి ఎపిసోడ్ కి ముఖ్య అతిధి గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు..ఇప్పటి వరుకు ఆహ మీడియా లో అత్యధిక వ్యూస్ వచ్చిన ఏకైక వీడియో ఇదే..దీని రికార్డు ని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కొడుతుందో లేదో చూద్దాము.