Pawan Kalyan And Trivikram: పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబో లో సినిమా ఎప్పుడు వస్తుందంటే..?

త్రివిక్రమ్ కి వరుస కమిట్ మెంట్లు ఉండటమే దీనికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా సినిమాలు కమిట్ అవ్వడం వల్ల త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం అయితే రావడం లేదు. మరి అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ సినిమా సెట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 30, 2024 10:20 am
Follow us on

Pawan Kalyan And Trivikram: ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు, ఎంత మంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ కొన్ని కాంబినేషన్లకు మాత్రం విపరీతమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లలో రాజమౌళి ఎన్టీఆర్, అల్లు అర్జున్ సుకుమార్, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ల కి మంచి గుర్తింపు ఉంటుంది. ఇక త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబో లో వచ్చిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, అజ్ఞాతవాసి సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు సినిమా వచ్చినా కూడా దానిమీద భారీ అంచనాలైతే ఉంటాయి. ఇక దానికి తగ్గట్టు గానే చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ కాంబో లో సినిమాలైతే రావడం లేదు. ఇక త్రివిక్రమ్ కి వరుస కమిట్ మెంట్లు ఉండటమే దీనికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరుసగా సినిమాలు కమిట్ అవ్వడం వల్ల త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం అయితే రావడం లేదు. మరి అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ సినిమా సెట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తర్వాత ముందుగా కమిట్ అయిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేస్తాడు. ఆలోపు త్రివిక్రమ్ కమిట్ అయిన అల్లు అర్జున్ సినిమా చేస్తాడు. ఇక దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబో లో ఒక భారీ సినిమా రాబోతున్నారు గా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా చేస్తాడా చూడాలి అనే ఉద్దేశ్యం లోనే ఉన్నారు. ప్రతి ఈవెంట్ లో కూడా త్రివిక్రమ్ కనిపించిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు అంటూ అభిమానులు విపరీతమైన గోల చేస్తూ ఉంటారు.

అందులో భాగంగానే త్రివిక్రమ్ పాన్ ఇండియా కథను కూడా పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ ఎంతవరకు తన సత్తాని చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక గుంటూరు కారం ఫ్లాప్ తో ప్రస్తుతం కొంతవరకు డీలా పడినప్పటికీ తర్వాత చేసే సినిమాతో పుంజుకోవాలనే ప్రయత్నంలో త్రివిక్రమ్ ఉన్నట్టు గా తెలుస్తుంది…