https://oktelugu.com/

క్రిష్ – పవర్ స్టార్ సినిమాకి బ్రేక్ !

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జనవరి 4 నుంచి షూట్ స్టార్ట్ అయింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది. అయితే, గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్ లో రెండు పాట‌ల్ని పూర్తి చేశాడ‌ట క్రిష్‌. గురువారం నుంచి 20 రోజుల బ్రేక్ తీసుకోబోతున్నారు. ఈ ఇరవై రోజులు క్రిష్ , వైష్ణ‌వ్ తేజ్ సినిమా పై కూర్చుంటాడట. ఇక […]

Written By:
  • admin
  • , Updated On : January 20, 2021 / 09:52 AM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా జనవరి 4 నుంచి షూట్ స్టార్ట్ అయింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది. అయితే, గురువారంతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో నైట్ ఎఫెక్ట్ లో రెండు పాట‌ల్ని పూర్తి చేశాడ‌ట క్రిష్‌. గురువారం నుంచి 20 రోజుల బ్రేక్ తీసుకోబోతున్నారు. ఈ ఇరవై రోజులు క్రిష్ , వైష్ణ‌వ్ తేజ్ సినిమా పై కూర్చుంటాడట. ఇక క్రిష్ – పవన్ సినిమాకు విరూపాక్ష‌ అనే టైటిల్ ని ప‌వ‌న్ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ ఇది. ప‌వ‌న్ ది రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో నటిస్తున్నాడు.

    Also Read: ‘మాస్టర్’ మూవీ వసూళ్లు చూస్తే షాకే..

    అయితే మొదటగా ఈ సినిమా సాంగ్ ను పోలాచ్చి వెళ్లి పవన్ – హీరోయిన్ కాంబినేషన్ లో డ్యూయట్ చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. అలాగే మూడు సాంగ్స్ షూట్ చేయాలి. కానీ, ఒక సాంగ్ తీసేసి.. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే చిత్రీకరించనున్నారు. ఇక వచ్చే వారం నుండి వైష్ణవ్ తేజ్ సినిమాను ముగించే పనిలో ఫుల్ బిజీగా ఉంటాడట క్రిష్. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ షూట్ కోసం రెడీ అవుతుంది.

    Also Read: చిరంజీవి ఇలా సర్ ప్రైజ్ చేస్తాడనుకోలేదు

    పవన్ ఆల్ రెడీ ఈ సినిమా చూసాడట. పవన్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. నిజానికి క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా చేయడానికి పవనే కారణమని తెలిసిందే. పవర్ స్టార్ చెప్పడంతోనే క్రిష్ ఈ సినిమా చేశాడని, పైగా సబ్జెక్ట్ కూడా పవనే సూచించాడని, కొండపొలం అనే నవలను సినిమాగా తీయమని పవన్ చెబితేనే క్రిష్ చేశాడని కూడా తెలిసిందే. ఇక క్రిష్ డైరెక్షన్ లో పవన్ చేస్తోన్న సినిమాను మార్చి కల్లా పూర్తి చేసి.. ఉగాదిగా స్పెషల్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఈలోగా ప‌వ‌న్ మ‌రో సినిమా షూటింగ్ లో బిజీ అవుతాడా? లేదంటే త‌న వ్య‌క్తిగ‌త‌, రాజకీయ ప‌నుల షెడ్యూల్ లో బిజీగా ఉంటాడా? అన్న‌ది తెలియాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్