Theatre Shutdown Issue : ఇటీవల కాలం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ చేయాలనే ప్రతిపాదన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సింగల్ స్క్రీన్ థియేటర్స్ కి ఇక నుండి లాభాల్లో వాటాలు ఇవ్వాలి అంటూ ఎగ్జిబిటర్స్ పెట్టిన ప్రతిపాదనకు నిర్మాతలు ఒక తాటి పైకి వచ్చి చర్చలు జరపడం. సరిగ్గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం విడుదల సమయంలో థియేటర్స్ ని మూసి వేస్తున్నాం అంటూ ప్రచారం అయ్యేలా చేయడం, వీటిపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యి మీ రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంది,ఇక ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తా అనే అర్థం వచ్చేలా వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి వారు వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టడం వంటివి పెద్ద చర్చలకు దారి తీసింది. దీని పై అల్లు అరవింద్ పార్టనర్ బన్నీ వాసు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘థియేటర్స్ మూసివేయాలి..సింగిల్ స్క్రీన్స్ ని రెంటల్ పద్దతిలో నడపలేము, కమీషన్ బేసిస్ మీద ఇక మీదట నడపాలి అనే ప్రతిపాదన చాలా రోజుల నుండి ఉంది. కానీ అది సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే చర్చకు వచ్చింది. ఇది కావాలని ‘హరి హర వీరమల్లు’ ని ఆపాలని చేసిన పని కాదు, యాదృచ్చికంగా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ తన సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా ఎవరో తప్పుగా ఆయన వద్దకు తీసుకెళ్లారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని బన్నీ వాసు ని అడగ్గా. అందుకు ఆయన సమాధానం చెప్తూ ‘ఈ విషయం పై నాకు పూర్తి అవగాహన లేదు కానీ, కొంతమంది ఎగ్జిబిటర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ లో పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నప్పుడు ఈ వ్యవహారం జరిగితే మంచి అటెన్షన్ వస్తుంది. థియేటర్స్ ని బంద్ చేద్దాం అని చర్చించుకున్న స్క్రీన్ షాట్స్ ఎవరి ద్వారానో పవన్ కళ్యాణ్ గారి వద్దకు వెళ్లాయి. అందుకే ఆయన ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎవరు ఆ ఎగ్జిబిటర్స్ అనేది నాకు పూర్తిగా తెలియదు’ అంటూ చెప్పుకొచ్చారు.
Producer Bunny Vas about the conspiracy on #HariHaraVeeraMallu release.#PawanKalyan pic.twitter.com/bOgnKyI839
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 10, 2025