Pawan Kalyan Supports Jana Nayagan Makers: ఏ ముహూర్తం లో లోహిత్ అనే వ్యక్తి KVN ప్రొడక్షన్స్ సంస్థ ని స్థాపించాడో తెలియదు కానీ, భారీ సినిమాలు నిర్మించి, వాటిని థియేటర్స్ లో విడుదల చేయకుండా ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్ తో ఆయన నిర్మించిన ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని , విడుదలని ఆపేయడం, ఆ సినిమా ఇప్పుడు సోషల్ మీడియా లో HD క్వాలిటీ తో లీక్ అవ్వడం వంటివి లోహిత్ కి తీవ్రమైన నష్టాలను కలిగించింది. ఈ కారణం చేత, ఈ నెల 11 న ఘనంగా KVN ప్రొడక్షన్స్ సంస్థ లో మొదలు అవ్వాల్సిన చిరంజీవి , బాబీ చిత్రం షూటింగ్ కూడా వాయిదా వెయ్యాల్సి వచ్చింది. మరో పక్క వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన టాక్సిక్ చిత్రాన్ని కూడా జూన్ 4 కి వాయిదా వెయ్యాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు ఆ సంస్థ నిర్మాతలు తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్న విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ , తీసుకున్న అడ్వాన్స్ నుండి రీసెంట్ గానే 15 కోట్ల రూపాయిల వరకు తిరిగి ఇచ్చేశాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. కమిట్ అయిన అమౌంట్ ఇస్తే తప్ప డబ్బింగ్ చెప్పను అని మొండికేసే హీరోలు ఉన్నటువంటి ఈ కాలంలో , నిర్మాత బాగుండాలి అనే గొప్ప ఉద్దేశ్యంతో వారి కష్టాలను అర్థం చేసుకున్న తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి చాలా గొప్ప మనసు ఉండాలి. ఇలాంటి సంఘటనల కారణంగానే పవన్ కళ్యాణ్ ని అభిమానులు దేవుడిలాగా భావిస్తుంటారు.
పవన్ లాగానే మిగిలిన హీరోలు కూడా సినిమా ప్రారంభానికి ముందు భారీ స్థాయిలో అడ్వాన్స్ లు తీసుకోకుంటే , ఇండస్ట్రీ లో నిర్మాత బ్రతుకుతాడు. నిర్మాత కారణంగా వేలమందికి అన్నం దొరుకుంటుంది, అలాంటి నిర్మాతే కష్టాలపాలు అయితే సినిమా ఎలా బ్రతుకుతుంది?, సినిమా బ్రతకాలంటే నిర్మాత బాగుండాలి, అప్పుడే సినీ ఇండస్ట్రీ పదికాలాలు పచ్చగా కొనసాగుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ‘జన నాయగన్’ చిత్రానికి నేడు , లేకపోతే రేపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవుతాయని , నిర్మాతలు ఈ చిత్రాన్ని ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
